Dochevarevarura: సోషల్ మీడియా టూ సిల్వర్ స్క్రీన్.. దోచేవారెవరురా మూవీతో ఎంట్రీ ఇవ్వనున్న ప్రణతి

నటనలో తమ ప్రావీణ్యం చూపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో ఈ భామ కూడా ఒకరు. ఆమె పేరు ప్రణతి. ఈమె తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు చేస్తూ నెటిజన్స్ కు దగ్గరయ్యారు.

Dochevarevarura: సోషల్ మీడియా టూ సిల్వర్ స్క్రీన్.. దోచేవారెవరురా మూవీతో ఎంట్రీ ఇవ్వనున్న ప్రణతి
Dochevarevarura

Updated on: Feb 27, 2023 | 9:00 PM

సోషల్ మీడియా కారణంగా చాలా మంది తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఎంతో మంది టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. నటనలో తమ ప్రావీణ్యం చూపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో ఈ భామ కూడా ఒకరు. ఆమె పేరు ప్రణతి. ఈమె తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు చేస్తూ నెటిజన్స్ కు దగ్గరయ్యారు. హృదయానికి హత్తుకునే వీడియోలతో నెటిజన్స్ చేత శబాష్ అనిపించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రణతి వెండి తెరపై అడుగు పెట్టారు. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రణతి ఇప్పుడు లీడ్ రోల్ లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు.

సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా దోచేవారెవరురా.. ఇప్పటికే విడుదల సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో మాళవిక సతీషన్ అజయ్ గోష్. బిత్తిరి సత్తి ..మాస్టర్ చక్రి. జెమిని సురేష్. నటీ నటులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రణతి అజయ్ గోష్ కు జోడీగా కనిపించనున్నారు.

ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించాడని సిద్దమైన ఈ సినిమాలో అజయ్ గోష్, ప్రణతి మధ్య వచ్చే కామెడీ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో ప్రణతికి మంచి గుర్తింపు రావడం ఖాయం అని చిత్రయూనిట్ చెప్తోంది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందాని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.