
కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్‌లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్‌లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్‌లో సోసోగా ఆడుతుంటే.. రీరిలీజ్ సినిమాలు మాత్రం అదరగొడుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే రీరిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషంగా రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు సినిమాలను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే.. థియేటర్స్ లో సినిమాలోని సీన్స్‌ను రీ క్రియేట్ చేస్తున్నారు. మొదట్లో పాటలకు డాన్స్ లు వేసి వైరల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సూపర్ హిట్ మూవీ అతడు సినిమా రీ రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. థియేటర్స్ కంటే టెలివిజన్ లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమాను తాజాగా రీ రిలీజ్ చేశారు. ఇక థియేటర్స్ లో ఫ్యాన్స్ ఈ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. థియేటర్స్ దద్దరిల్లాయి.. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.
సాంగ్స్ కు డాన్స్ లతో దుమ్మురేపారు. కాగా ఓ యువతి అతడిలోని సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసి అందరిని ఆకట్టుకుంది. పిలిచినా రానంటావా సాంగ్ లో త్రిషల రెడీ అయ్యి.. థియేటర్స్ లో డాన్స్ చేసి అందరిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ బాబు అభిమానులు ఈ చిన్నదాని ఐడీ కోసం సోషల్ మీడియాను తెగ గాలిస్తున్నారు. ఈ క్రామంలోనే ఈ చిన్నదాని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి