NTR: పక్కా ప్లానింగ్‌తో పాన్ ఇండియా మూవీస్‌ను లైన్‌లో పెడుతున్న యంగ్ టైగర్… తారక్ 30 తర్వాత ఎవరితోనో తెలుసా..

|

Sep 17, 2021 | 8:32 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసి రిలాక్స్ అవుతున్నాడు. జక్కన సినిమా కోసం చాలా కష్టపడ్డాడు తారక్.

NTR: పక్కా ప్లానింగ్‌తో పాన్ ఇండియా మూవీస్‌ను లైన్‌లో పెడుతున్న యంగ్ టైగర్... తారక్ 30 తర్వాత ఎవరితోనో తెలుసా..
Tharak
Follow us on

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసి రిలాక్స్ అవుతున్నాడు. జక్కన సినిమా కోసం చాలా కష్టపడ్డాడు తారక్. ఈ మూవీలో గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు తారక్. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వాయిదా పడుతూ.. పడుతూ మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోకు హోస్ట్‌గా చేస్తున్నాడు టైగర్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత  తారక్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలనీ చూశారు. సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.  ఈ సినిమా అయినా పోయి రావలె హస్తినకు అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో కానీ త్రివిక్రమ్ సడన్‌గా మహేష్ వైపు ట్రన్ అయ్యారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ మహేష్‌తో సినిమా చేయనున్నాడు. దాంతో తారక్ త్రివిక్రమ్ సినిమా అటకెక్కింది.

దాంతో తారక్ కోసం ముందుకు వచ్చారు కొరటాల శివ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జనతాగ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఈ క్రమంలోనే తారక్‌‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను ఎంపిక చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. అనిరుధ్‌ ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే తారక్‌తో చేయి కలపనున్నారు కొరటాల. ఇక ఈ సినిమా తర్వాత తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: నేడు ఈడీ అధికారుల ముందుకు హీరో తనీష్.. ప్రశ్నల వర్షం కురిపించనున్న అధికారుల..

Sonu Sood: సోనూసూద్ పై ఇన్‌కం టాక్స్ దాడులు.. ఐదు వేల రూపాయలతో ముంబాయి వచ్చిన మెస్సియా ప్రస్తుత ఆస్తులు ఎంతో తెలుసా?

Prabhas: షూటింగ్‌ గ్యాప్‌లో ప్రభాస్‌ ఏం చేస్తుంటాడో తెలుసా.? అసలు విషయాన్ని బయటపెట్టిన దర్శకుడు ఓంరౌత్‌..