Jr NTR: అభిమానులకు క్షమాపణలు చెప్పిన యంగ్ టైగర్..కారణం ఏంటంటే

|

Sep 03, 2022 | 6:30 AM

ప్రస్తుతం బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మాస్త్ర. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jr NTR: అభిమానులకు క్షమాపణలు చెప్పిన యంగ్ టైగర్..కారణం ఏంటంటే
Jr Ntr
Follow us on

ప్రస్తుతం బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మాస్త్ర(Brahmastra ). పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా ఆయన సతీమణి అలియాభట్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున , అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. నిజానికి ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉండగా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. “ముందుగా ఇక్క‌డ‌కు రావాల‌నుకున్న అభిమానులు రాలేక‌పోయినందుకు వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఎంతో ఆర్భాటంగా చేద్దామని అనుకున్నారని, అయితే గణేష్ బందోబస్తు ఉండడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేకపోయారన్నారు. పోలీసులు చెప్పింది మన కోసమే వారు చెప్పింది వినడం దేశ పౌరుడిగా మన ప్రధమ ధర్మం అన్నారు తారక్. ఈవెంట్‌కి రాలేక‌పోయిన‌ప్ప‌టికీ మంచి సినిమాల‌ను ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం అన్నారు తారక్. అమితాబ్ బచ్చన్ గారికి నేని పెద్ద ఫ్యాన్, ఆయనలో ప్రతి క్వాలిటీ నాకు ఇష్టం.. అమితాబ్ తర్వాత నాకు రణబీర్ అంటే ఇష్టం.. రాక్‌స్టార్‌ సినిమా నుంచి రణ్‌బీర్‌ నటనంటే తనకంతో ఇష్టమని చెప్పుకొచ్చారు తారక్. అలాగే సినిమా ఇండ‌స్ట్రీ తెలియని ఒత్తిడికి లోనవుతుంది అన్నారు. ఎందుకంటే ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ఏదో కావాలి. ఇంకా ఏదో కావాలి.  మొత్తం సినీ ఇండ‌స్ట్రీ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. మంచి సినిమాలు.. గొప్ప సినిమాల‌ను ప్రేక్ష‌కుల కోసం రూపొందిస్తాం. బ్ర‌హ్మాస్త్రం సినిమా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఓ బ్ర‌హ్మాస్త్రం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..