
ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలే.. నటనలో తాత నందమూరి తారకరామారావు దగ్గర ఓనమాలు దిద్ది.. డాన్స్ లో మైకేల్ జాక్సన్ ను మరిపించేలా మెప్పించి.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు. తారక్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోయింది. ఒకటీ, రెండూ… కాదు ఏకంగా పదుల సంఖ్యలో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయంటేనే ఎన్టీఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తారక్ ప్రపంచామంతట అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
కేవలం 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ డమ్‌ను రుచి చూశాడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతోనూ సతమతమయ్యాడు… సినీ కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఉత్తానపతనాలను చవిచూశాడు… ఆది బ్లాక్ బ్లస్టర్‌తో మొదలైన ఎన్టీఆర్ స్టార్‌డమ్ ఆర్ఆర్ఆర్‌తో మరింత పీక్స్‌కి చేరింది. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ఎన్టీఆర్ నిలవడమే ఇందుకు నిదర్శనం.
ఇప్పటికే సోషల్ మీడియాలో తారక్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫోటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు ఫ్యాన్. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు విషెస్ చెప్తున్నారు ఫ్యాన్స్. ఇక తారక్ పుట్టిన రోజు పురస్కరించుకొని నిన్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఎన్టీఆర్ 30 మూవీ ఫస్ట్ లుక్ ను .. టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక తారక్ లుక్ అయితే కేక అనే చెప్పాలి. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది.