Allu Arjun : సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలు చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమాల విశేషాలతోపాటుగా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. నిత్యం ఏదో ఒక అప్డేట్‌తో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు మన హీరోలు. ఇక నెట్టింట మన హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు బన్నీ. అయితే ఈ మార్క్‌ను మరో యంగ్ హీరో సమం చేశాడు. ఆ హీరో ఎవరో కాద.. టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు ఈ రౌడీ బాయ్. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయాడు విజయ్. ఇండస్ల్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు పోటీగా మారాడు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నెంబర్ వన్‌లో ఉన్నాడు అల్లు అర్జున్ . ఆతర్వాత సెంకండ్ ప్లేస్‌లోకి వచ్చేశాడు విజయ్ దేవరకొండ.
ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండకు 13 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇటీవలే బన్నీ ఈ రికార్డ్‌ను అందుకొని నెంబర్ వన్‌గా నిలవగా.. కేవలం మూడు రోజుల్లోనే విజయ్ దేవరకొండ ఈ రికార్డు సమం చేశాడు. ఐదేళ్ళ కింద అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిపోయాడు విజయ్. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో స్టార్ గా మారాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత రెండు మూడు ఫ్లాపులు కూడా పలకరించాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు విజయ్ దేవరకొండ. ఎప్పటికప్పుడు అభిమానులకు అందుబాటులో ఉంటూ.. మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయర్స్‌ను పెంచుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సౌత్ హీరోలకు
సాధ్యం కాని రికార్డులు విజయ్ దేవరకొండకు సాధించాడు. తక్కువ సమయంలోనే విజయ్‌ను కోటి 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు విజయ్ ధన్యవాదాలు తెలిపాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :