మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ యంగ్ హీరోకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేస్తున్నాడు. కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు సంయక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ గ్రామీణ ప్రాంతానికి చెందిన జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి. అలాగే…. ఈ సినిమా నుంచి విడుదలైన ఓ ఒబులమ్మ సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8వ తేదీని ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే గత కొద్ది రోజులు ఈ సినిమా గురించి వరుస కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడలేదని.. ముందుగా అనుకున్న టైం ప్రకారమే సినిమా విడుదల కాబోతుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. లవ్ అండ్ ఎమోషన్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండడంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: love story: నాగచైతన్య, సాయి పల్లవిల అందమైన ప్రేమకథ.. ప్రేక్షకుల ముందుకు లవ్ స్టోరీ వచ్చేది రేపే..