ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణివారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్.. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హిట్టు , ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కిరణ్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం వినరో భాగ్యం విష్ణు కథ. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఈనెల 18న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తన సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు కిరణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ తన గురించి నెట్టింట వస్తోన్న నెగిటివిటీపై స్పందించారు. తనకు యాటిట్యూడ్ ఉందని.. తన గురించి తప్పుడు జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మూడేళ్లలో కేవలం ఐదు సినిమాలు చేసిన నాలాంటి చిన్న హీరోపై అంత నెగిటివిటీ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదన్నారు. “ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ గా.. నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఏ సినిమా షూటింగ్ లో అయినా ఒక లైన్ మెన్ దగ్గర నుంచి అందరినీ అన్న అని పిలుస్తాను. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అందరికీ గౌరవం ఇస్తాను. అన్నా అనే పిలుస్తాను. కానీ కిరణ్ అంటే అలా అంటా.. ఇలా అంటా అని మీడియాలో కూడా అడుగుతుంటే నేను ఎంత మందికి సమాధానం చెప్పగలను. వాడు ముందు హంబుల్ గా ఉంటాడు.. వెనక మరోలా ఉంటాడు అంటారు కొందరు. వాటికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో అర్థం కాదు. నేను హార్స్ గా ఉంటేనే గట్టిగా అరిస్తేనే కరెక్టా.. నేను నాలా ఉంటున్నా.. అలా కూడా ఉండనివ్వకపోతే నేనేం చేయాలి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరోతో నాకు ఎలాంటి పరిచయం లేదు.. అలాంటప్పుడు వాళ్లకు నా గురించి తప్పుగా చేప్తే నేనేం చేయగలను. వాళ్లకు నేను పరిచయం ఉంటే నేనంటే ఏంటో వాళ్లకు తెలుస్తోంది. నా గురించి విన్న మాటలే వాళ్ళకు పరిచయం. దానివల్ల కిరణ్ కు యాటిట్యూడ్ ఎక్కువంట. ఆ అబ్బాయి అలా అంట అని వాళ్లకు చెప్తే చేయగలను అన్నారు. బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాలేదు.. ఇక్కడ ఓ వ్యవస్థ ఉంటుందని.. దాన్ని ఎలా ఫాలో కావాలనేటువంటి విషయాలు తెలీదు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే నా మంచి కోరుకునే వాళ్లు కావచ్చు, చెడు కోరుకునేవాళ్లు కావచ్చు.. నాకు వంద విషయాలు చెప్తుంటారు. నీ మీద కావాలనే ఇలా చేయిస్తున్నారు, మిమ్మల్ని తొక్కేయడానికి చూస్తున్నారని చెప్తుంటారు. కానీ అవేమీ నేను నమ్మను. నేను చదువుకుంటున్నప్పటి నుంచి నేను నమ్మేది ఒక్కటే.. ఏదైనా మనం వినాలి, మనం చూడాలి. చెప్పుడు మాటలు నమ్మొద్దు. అలాంటిది ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎవరి మైండ్‌సెట్స్ ఎలా ఉంటాయో తెలీదు. అందుకే ఎవరైనా ఏదైనా తప్పుగా చెప్పినా నేను వినను’ అని చెప్పుకొచ్చారు.