Kiran Abbavaram: ఫస్ట్ హీరోయిన్‏తో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం.. ఫోటోస్ వైరల్..

వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్.. ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన మొదటి సినిమాలో కథానాయికగా నటించిన రహస్య గోరఖ్‏తో త్వరలోనే ఏడడుగులు వేయనున్నాడు. రాజా వారు రాణి గారు సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని.. చాలాకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఈ జంట ఎప్పుడు మాట్లాడలేదు..తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Kiran Abbavaram: ఫస్ట్ హీరోయిన్‏తో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం.. ఫోటోస్ వైరల్..
Kiran Abbavaram, Rahasya Go

Updated on: Mar 14, 2024 | 6:36 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. నటనపై ఆసక్తితో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రాజా వారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్.. ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన మొదటి సినిమాలో కథానాయికగా నటించిన రహస్య గోరఖ్‏తో త్వరలోనే ఏడడుగులు వేయనున్నాడు. రాజా వారు రాణి గారు సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని.. చాలాకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఈ జంట ఎప్పుడు మాట్లాడలేదు..తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ నిశ్చితార్థం ఇరు కుటుంబసభ్యులు, స్నేహితులు మధ్య గ్రాండ్ గా జరిగింది. మార్చి 13న సాయంత్రం వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఈ జంటకు సినీ సెలబ్రెటీస్, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరి ప్రేమ పెళ్లి వరకు చేరింది. ఆగస్టులో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.

2019లో రాజావారు రాణిగారు సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో కిరణ్ కు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా కనెక్ట్ కావడం లేదు. వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ద పెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.