భారత్‍లో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. గత రెండు రోజులుగా దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు సినీ ఇండస్ట్రీ పై మరోసారి కరోనా పంజా విసురుతుంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రెటీలు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, షారుఖ్ ఖాన్ వంటి మరికొంత మంది స్టార్లకు కోవిడ్ వచ్చినట్లుగా ప్రకటించారు. ఈ కరోనా మహమ్మారి కేసులు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు యంగ్ హీరో అశోక్ కల్లాకు (Ashok Galla) కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అశోక్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు.. ” అందరికీ హాయ్.. నాకు కోవిడ్ పాజిటివ్ అని పరీక్షలలో తేలింది. అదృష్టవశాత్తూ కేవలం తేలికపాటి ఒత్తిడి.. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే సాధారణ స్థితికి (కోలుకుంటాను) చేరుకుంటాను.. గత రెండు రోజులుగా నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరూ దయచేసి పరీక్షలు చేయించుకోండి. సినిమా అభిమాని అయినా నాకు ఇది నిరుత్సాహపరిచే వార్త.. ఎందుకంటే నేను విక్రమ్, మేజర్ చిత్రాలను థియేటర్లలో చూడలేకపోతున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.
ట్వీట్..
Hi everyone, I have tested positive for Covid, fortunately it’s a mild strain and should be back to normal soon. All those who have been in contact with me last couple of days please get tested. Being a movie buff my biggest disappointment is missing #vikram and #Major ? TC all!
— Ashok Galla (@AshokGalla_) June 6, 2022