Akhil Akkineni: 150 అడుగుల బిల్డింగ్ నుంచి జంప్ చేసిన అఖిల్.. అభిమానులు షాక్

|

Apr 17, 2023 | 6:33 AM

అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఏజెంట్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది.

Akhil Akkineni: 150 అడుగుల బిల్డింగ్ నుంచి జంప్ చేసిన అఖిల్.. అభిమానులు షాక్
Akhil Akkineni
Follow us on

సినిమాలతోనే కాదు సాహసాలతోనూ ఆకట్టుకుంటున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్. ఏకంగా 150 అడుగులనుంచి రోప్ సాయంతో జంప్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఏజెంట్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. రా ఏజెంట్ గా ఈ సినిమాలో అఖిల్ నటిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా తాజాగా విజయవాడలో ఓ మాల్ పై నుంచి అఖిల్ జంప్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

దాదాపు 150 అడుగుల పైబడిన భారీ భవంతి నుంచి రోప్ సాయంతో ఈ యంగ్ హీరో జంప్ చేయడం అభిమానులకు బిగ్ షాకిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్న సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.