
బాలకృష్ణ కోసం కుర్ర దర్శకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు సీనియర్లతోనే ఎక్కువగా సినిమాలు చేసిన ఈయన.. కొన్నేళ్లుగా మనసు మార్చుకున్నారు. మరోవైపు యంగ్ డైరెక్టర్స్ సైతం బాలయ్యను దృష్టిలో పెట్టుకుని కథలు అల్లుకుంటున్నారు. ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుందో అలాంటి కథల్నే సిద్ధం చేస్తున్నారు. తాజాగా మరో కుర్ర దర్శకుడు బాలయ్య లిస్టులో చేరిపోయారు. బాబు బాగా బిజీ.. బాలయ్యకు ఈ పదం ఇప్పుడు బాగా సూట్ అవుతుంది. ఖాళీ అనే మాటే లేకుండా షూటింగ్స్‌తో బిజీ అయిపోయారు ఈయన. తాజాగా గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK 107 టర్కీ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. దీని తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా రెడీగా ఉంది. బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని.. బాలయ్య కోసం చూస్తున్నారు ఈయన.
అఖండ తర్వాత బాలయ్య వర్కింగ్ స్టైల్ మారింది. ముఖ్యంగా కుర్ర దర్శకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు ఈయన. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆయన డైరెక్టర్స్ వెంట పడట్లేదు.. ఈ జనరేషన్ దర్శకులే బాలయ్య కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. తాము కోరుకున్న వింటేజ్ బాలయ్యను స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నారు. అందుకే మూడేళ్లుగా బాలయ్య కోసం వేచి చూస్తున్నారు అనిల్ రావిపూడి. నవంబర్ నుంచి అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కమర్షియల్ పంథాలో సాగే తండ్రీ కూతుళ్ల కథ ఇది. 2023 సమ్మర్‌లో NBK 108 విడుదల కానుంది.
దీని తర్వాత బాలయ్యతో బాబీ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవితో వాల్తేరు వీరయ్య చేస్తున్నారు బాబీ. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి యంగ్ డైరెక్టర్స్‌తో నందమూరి నటసింహా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలిక. మరోవైపు అటు బుల్లితెర హోస్ట్‌గా బాలయ్య దూసుకుపోతున్నారు. ఆహాలో అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్ అదిరే హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రజంట్ ఈ షో సెకండ్ సీజన్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..