టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే శాకుంతలం సినిమా కంప్లీట్ చేసిన సామ్.. ఇప్పుడు యశోద, ఖుషి సినిమాల్లో నటిస్తోంది. ఇందులో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా వస్తోంది యశోద. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. యశోద సినిమా షూటింగ్ పూర్తైందంటూ సామ్ లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సమంత మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ చిత్రానికి హరి..హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం 100 రోజుల్లోనే యశోద షూటింగ్ పూర్తిచేసి.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఒక్క పాట షూటింగ్ మిగిలి ఉంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈనెల 15 తర్వాత ఇతర భాషలకు డబ్బింగ్ పనులను ఏకకాలంలో పూర్తిచేస్తాం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నాం. ఇందులో సమంత పూర్తి అంకితభావం, నిబద్ధతతో పనిచేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయనున్నాం అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.
Our #YashodaTheMovie Talkie wrapped ?
Stay tuned for exciting updates coming your way soon ? #Yashoda @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @harishankaroffi @hareeshnarayan #Manisharma @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/llPODf5TkL
— Sridevi Movies (@SrideviMovieOff) July 11, 2022
ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయాలని భావించినప్పటికీ అనుహ్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.