Samantha: యాక్షన్ సన్నివేశాల చేయమంటే సమంత ఆ మాట చెప్పింది.. యశోద డైరెక్టర్స్ చెప్పిన విషయాలు..

ఇప్పటివరకు ఎన్నో అవార్డులను అందుకున్నాం. కానీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మరింత చేరువకావడానికి విభిన్నమైన కథతో రావాలనుకున్నాము. అందుకే కాస్త విరామం

Samantha: యాక్షన్ సన్నివేశాల చేయమంటే సమంత ఆ మాట చెప్పింది.. యశోద డైరెక్టర్స్ చెప్పిన విషయాలు..
Samantha

Updated on: Jul 12, 2022 | 1:34 PM

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం యశోద (Yashoda). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా.. చిత్రీకరణ పూర్తైనట్లు సోమవారం మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సమంతను మాత్రమే ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు డైరెక్టర్ హరి శంకర్, హరీష్ నారయణ్. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశోద సినిమా.. సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డైరెక్టర్స్ హరి శంకర్, హరీష్ నారాయణ్ మాట్లాడుతూ.. ” ఇప్పటివరకు ఎన్నో అవార్డులను అందుకున్నాం. కానీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మరింత చేరువకావడానికి విభిన్నమైన కథతో రావాలనుకున్నాము. అందుకే కాస్త విరామం తర్వాత యశోద సినిమాను ప్రారంభించాము. ఈ చిత్రాన్ని దాదాపు 2 సంవత్సరాలు తెరకెక్కించాము. థియేటర్లలోకి వచ్చే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి కమర్షియల్‏గా కాకుండా.. విభిన్న కథానాలను అర్థం చేసుకునే హీరోయిన్ కావాలనుకున్నాము.. అందుకే యశోద సినిమా కోసం సమంతను తీసుకోవాలనుకున్నాము. అదృష్టవశాత్తు ఆమె కథ విన్న కొద్ది నిమిషాల్లోనే ఓకే చెప్పారు.

కథ విన్న తర్వాత తనకు గూస్ బంప్స్ వస్తున్నాయని.. ఈ సినిమాను తాను తప్పకుండా చేయాలనుకుంటున్నట్లు సమంత చెప్పారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కంటే ముందే మేము యశోద సినిమా కోసం ఆమెను సంప్రదించాము. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా.. యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు ఎలాంటి సహాయం తీసుకోవడానికి సామ్ ఇష్టపడలేదని తెలిపారు. ” సినిమాలోని ప్రధాన యాక్షన్ సీన్స్ సెట్ లో చిత్రీకరించాము. ఫైట్ సీక్వెన్స్ ల కోసం సమంత 2 లేదా 3 రోజుల పాటు సాగిన రిహార్సల్ కోసం సమంత అక్కడే ఉన్నారు. తాను అన్ని సన్నివేశాలను స్వయంగా చేయాలనుకున్నారు. ఎవరి సహాయం లేకుండానే ఆమె యాక్షన్, ఫైట్ సన్నివేశాలు చేసింది” అని తెలిపారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్, అలాగే వెంకట్ మాస్టర్లు యశోదలో భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు.