Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

కన్నడ సూపర్ స్టార్ యష్ పుట్టినరోజున 'టాక్సిక్' సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమా కోసం యష్ 50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం నడుస్తుంది. కానీ ఒక హీరోయిన్ మాత్రం అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది.

Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!
Kiara Advani, Yash, Nayanth

Updated on: Jan 09, 2026 | 2:13 PM

కన్నడ సూపర్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ 2’ సినిమాతో విపరీతమైన పాపులర్ అయ్యాడు. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడి నుంచి రాబోయే చిత్రం ‘టాక్సిక్’. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కానీ గురువారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ మాత్రం వేరేలెవల్. ఈ సినిమాలో అతని అద్భుతమైన నటన చూసి, అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చుద్ధామా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ సినిమా 2026 లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

ఈ టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఈ సినిమాకు యష్ ఎంత పారితోషికం తీసుకున్నాడనే చర్చ మొదలైంది. ఈ సినిమాకు నటుడు యష్ 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడని టాక్ నడుస్తుంది. యష్ నటించిన ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు. కియారా అద్వానీ ఈ సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం తీసుకుంది. ఇది ఆమె మొదటి సినిమాల కంటే చాలా ఎక్కువ. ఈ సినిమా కోసం నయనతార 12 నుంచి 18 కోట్ల రూపాయల ఫీజు తీసుకుంది. రుక్మిణి వసంత్ మెలిస్సా 3 నుంచి 5 కోట్ల రూపాయల ఫీజు తీసుకుంది. హుమా ఖురేషి, తారా సుతారియా 2 నుంచి 3 కోట్ల రూపాయల ఫీజు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

ఈ టీజర్ 21 గంటల్లో సరిగ్గా 47 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సినిమా టీజర్ 24 గంటల్లో 5 కోట్ల వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. యష్ ‘రాయ’ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ‘టాక్సిక్’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతు మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకురాలు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..