Yash: మరోసారి పాన్ ఇండియాను షేక్ చేయనున్న రాకింగ్ స్టార్.. యష్ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది

యష్ కొత్త సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు . 'యష్ 19' కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు యష్ తన నెక్స్ట్ సినిమా ను అనౌన్స్ చేశాడు. ' యష్ 19 ' మూవీ టైటిల్ 'టాక్సిక్'. ఈ టైటిల్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ టైటిల్ ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Yash: మరోసారి పాన్ ఇండియాను షేక్ చేయనున్న రాకింగ్ స్టార్.. యష్ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది
Yash

Updated on: Dec 08, 2023 | 1:04 PM

కేజీఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాదు అని భాషల్లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు యష్. రెండు భాగాలుగా వచ్చిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగాను రికార్డ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2 తర్వాత యష్ ఎవరోతో నటించనున్నాడు. ఏ డైరెక్టర్ యష్ ను డైరెక్ట్ చేయనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. యష్ ఇంతవరకు తన కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. యష్ కొత్త సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు . ‘యష్ 19’ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు యష్ తన నెక్స్ట్ సినిమా ను అనౌన్స్ చేశాడు. ‘ యష్ 19 ‘ మూవీ టైటిల్ ‘టాక్సిక్’. ఈ టైటిల్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ టైటిల్ ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

యష్ ‘కేజీఎఫ్ 2’ చిత్రం ఏప్రిల్ 2022లో విడుదలైంది. దీని తరువాత, యష్ తదుపరి చిత్రం గురించి అనేక పుకార్లు వచ్చాయి. ‘యష్ 19’ చిత్రానికి నర్తన్ దర్శకత్వం వహిస్తారని వినిపించింది. కానీ, ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. ‘కేజీఎఫ్ 2’ విడుదలైన ఏడాదిన్నర తర్వాత యశ్ కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘టాక్సిక్’ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ చూసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సినిమాను 10-4-2025న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. #Toxic హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా కన్నడలోనే కాకుండా పలు భాషల్లో కూడా విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో నటీనటుల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.