Aditi Rao Hydari : ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదిహేను సంవత్సరాలు గడిచినా.. ఇప్పటికి ప్రతి సినిమా కొత్తగానే ఉంటుందని చెబుతుంటుంది హీరోయిన్ అదితి రావు హైదరి.. ఈ సందర్భంగా ఓ సినిమా ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ”సెట్లోకి అడుగుపెట్టినప్పుడు చాలా టెన్షన్‌గా ఫీలవుతాను నేను చేసేది ప్రతీది కొత్తగానే అనిపిస్తోంది. దర్శకుడు చెప్పినప్పుడు ఏమి చేయాలో అర్థం కాదనిపిస్తోంది కానీ కరెక్ట్‌గా చేస్తాను ఆ పాత్ర ఏమీటో నాకు తెలియదు.. అలాంటప్పుడు ఆ పాత్రకి సరైన న్యాయం చేయగలనా అని అనుమానం ఉంటుంది. దర్శకుడి ముఖం మీద చిరునవ్వు చూస్తానా లేదా అని అయోమయంగా ఫీలవుతానని” చెప్పుకొచ్చింది..
”సినిమా ప్రారంభించడానికి రెండు రోజుల ముందు నేను ఎలా ఉంటాను అంటే? ఆకలితో ఉన్న చిన్నపిల్లవాడిలా మారిపోతా. ఒక్క చోట నిశ్శబ్దంగా కుదురుగా కూర్చోలేను. ఆకలితో ఉన్న చిన్నపిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో మీకు తెలుసా? అలా నేను ప్రవర్తిస్తాను’’ అని తెలిపింది. ‘చెలియా’ ‘నవాబ్’ సినిమాలతో సౌత్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి.. తెలుగు ప్రేక్షకులకు ‘సమ్మోహనం’ సినిమాతో మరింత దగ్గరైంది. ప్రస్తుతం ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో మాస్ మహారాజ‌్ రవితేజ హీరోగా తెరకెక్కనున్న ‘మహాసముద్రం’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ‘శ్రీరంగం’ చిత్రంలోని ప్రధాన పాత్ర అయిన మధురగా అలరించింది. ‘ఢిల్లీ-6’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి ‘ధోబి ఘాట్’, ‘రాక్‌స్టార్’, ‘గుడ్డు రంగీలా’వంటి సినిమాలు చేసింది.