నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న బాలయ్య నెక్ట్స్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భగవంత్ కేసరి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్ , సాంగ్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.
బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా బాబీ మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బాలయ్యతో బాబీ సినిమా చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.