Varun Tej- Lavanya Tripathi : వరుణ్, లావణ్య పెళ్లి పనులు షురూ.. వివాహం జరిగేది అప్పుడేనా..

ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్ మెంట్ జరగడం. తాజాగా రామ్ చరణ్ కు పాప పుట్టింది. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరగనుంది. ఇక పెళ్లి పనులు షురూ అయ్యాయని తెలుస్తోంది.

Varun Tej- Lavanya Tripathi : వరుణ్, లావణ్య పెళ్లి పనులు షురూ.. వివాహం జరిగేది అప్పుడేనా..
Varun Tej Lavanya Tripathi

Updated on: Jun 22, 2023 | 8:00 AM

మెగా ఫ్యామిలీలో వరుసగా శుభపరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్ మెంట్ జరగడం. తాజాగా రామ్ చరణ్ కు పాప పుట్టింది. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరగనుంది. ఇక పెళ్లి పనులు షురూ అయ్యాయని తెలుస్తోంది. మంగళవారం తెల్లవారు జామున రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనించారు. దాంతో మెగా స్టార్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. చరణ్ కు పాప పుట్టడంతో ఇరు కుటుంబాలు ఆనందంలో తేలిపోతున్నారు. ఆడపిల్ల పుట్టడం శుభపరిణామం అని పేర్కొన్నారు చిరంజీవి. ఇక వరుణ్ తేజ్ పెళ్లి పనులు కూడా షురూ అయ్యాయని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ . లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి మిస్టర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఈ ఇద్దరు చాలా కాలం వీరి ప్రేమ గురించి బయట పెట్టలేదు. ఇద్దరూ కలిసి ఎక్కడ కనిపించలేదు.

తాజాగా ఈ ఇద్దరి ఎంగేజ్ మెంట్ కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. ఇక వీరి పెళ్లి ఇటలీలో జరగనుందని తెలుస్తోంది. మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది ఆ టైంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారట. దాంతో వీరి వివాహం కూడా అక్కడే జరగనుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి సెప్టెంబర్ లేదా అక్టోబర్ జరగనుందట. వీరి వివాహం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.