Beast Movie: దళపతి విజయ్(Thalapathy vijay )నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై ముందునుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్.. సాంగ్స్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన అరబిక్ కుతు సాంగ్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పటివరకు విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులోనూ డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో తెలుగులోనూ విజయ్‍కు మంచి ఫాలోయింగ్ ఉంది. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక బీస్ట్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా బుట్ట బొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను మార్చారని తెలుస్తుంది. అయితే తెలుగు తమిళ్ భాషల్లో ఈ మూవీ బీస్ట్ టైటిల్ తోనే రిలీజ్ అవుతున్నప్పటికీ హిందీలో మాత్రం టైటిల్ మార్చరట మేకర్స్.. బాలీవుడ్ లో ఈ మూవీని ‘రా’ ( RAW)అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. విజయ్ నుంచి ‘మాస్టర్’ తరువాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు 11 కోట్లకు అమ్ముడైనట్టుగా చెప్పుకుంటున్నారు. అనిరుధ్ సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. సెల్వ రాఘవన్.. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు దళపతి ఫ్యాన్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :