
స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత తమిళ్ సినిమాలతో బిజీ అయ్యింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ్ సినిమాలకే పరిమితం అయ్యింది. ఇక ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ సి చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్ 69 సినిమాతో పాటు , అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది.
ఇదిలా ఉంటే త్రిషకు సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక పై సినిమాలకు గుడ్ బై చెప్పనుంది తెలుస్తుంది. ఇప్పుడు ఈవార్త కోలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇక పై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది.
త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతోనూ నటిస్తుంచింది. అలాగే తమిళ్ లోనూ అందరు స్టార్స్ తో నటించింది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్తుందన్న వార్తలను ఆమె అభిమానులు కొట్టిపారేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.