Unstoppable With NBK Season 2 : బాలయ్య షోకు గెస్ట్‌గా ఆ సీనియర్ హీరో రానున్నాడా.. సందడి డబుల్ అవ్వడం ఖాయం

|

Nov 01, 2022 | 3:31 PM

కుర్ర హీరోలను తన స్టైల్ లో ఆటపట్టిస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ వన్ సూపర్ సక్సెస్ అయ్యింది. బాలయ్య దెబ్బకు దేశంలోనే నెంబర్ వన్ గా ఈ టాక్ షో నిలిచింది.

Unstoppable With NBK Season 2 : బాలయ్య షోకు గెస్ట్‌గా ఆ సీనియర్ హీరో రానున్నాడా.. సందడి డబుల్ అవ్వడం ఖాయం
Unstoppable 2
Follow us on

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అదరగొడుతోన్న షో అన్ స్టాపబుల్. ప్రాముఖ ఓటీటీ సంస్థ ఆహాలో టెలికాస్ట్ అవుతోన్న ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది. నటసింహం సినిమాల్లోనే కాదు ఈ టాక్ షో లోకూడా తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు. కుర్ర హీరోలను తన స్టైల్ లో ఆటపట్టిస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ వన్ సూపర్ సక్సెస్ అయ్యింది. బాలయ్య దెబ్బకు దేశంలోనే నెంబర్ వన్ గా ఈ టాక్ షో నిలిచింది. ఇప్పటికే సీజన్ వన్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలు వచ్చి సందడి చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఇక త్వరలో టెలికాస్ట్ కానున్న మూడో ఎపిసోడ్ లో మరో ఇద్దరు యంగ్ హీరోలు అడవి శేష్, శర్వానంద్ హాజరుకానున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ ఇద్దరితో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రోమోలోనే ఇలా ఉంటే ఇక ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో స్టార్ హీరోలు బాలయ్య షోకు హాజరు కానున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో సీనియర్ హీరో కూడా అన్ స్టాపబుల్ షో కు హాజరుకానున్నారని తెలుస్తోంది.

బాలయ్య షోకు విక్టరీ వెంకటేష్ హాజరుకానున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. బాలయ్య షోకు వెంకీ మామ హాజరు అవుతారని టాక్ వినిపిస్తుండటంతో ఇద్దరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ , వెంకటేష్ ఒకే వేదిక మీద కనిపించడం చాలా అరుదు. మామాలుగానే వెంకీ మామ సరదా మనిషి.. ఇక బాలయ్య తో కలిస్తే ఆ సరదా డబుల్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్. మరి బాలయ్య షోకు వెంకీ మామ హాజరవుతారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..