
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడొస్తుంది.. చిన్న అప్డేట్ ఇచ్చిన చాలు సోషల్ మీడియాను షేక్ చేస్తాం అంటున్నారు తారక్ ఫాన్స్ . ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు తారక్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో తారక్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. కొమురం భీమ్ గా తారక్ అద్భుత నటనను కనబరిచారు. ఇక ఈ సినిమా ఆస్కార్ రేస్ లోనూ ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తారక్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ చివరిగా చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయ్యింది . దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ కూడా తారక్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
గతంలో కొరటాల శివ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే . మంచి మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మాత్రం మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు.
ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టి 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. తారక్ – కొరటాల ఫిలింలో సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కథ ప్రకారం సంజయ్ విలన్ అయితే బాగుంటుందని నిర్ణయించిన కొరటాల శివ.. ఇటీవల సంజయ్ దత్ కేజీఎఫ్ సినిమాలో అధీరా గా నటించి అలరించారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకూడా పాన్ ఇండియా మూవీ కావడంతో సంజయ్ దత్ ని విలన్ గా ఎంపిక చేశారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.