Sai Pallavi : మొదటిసారి అలాంటి సాంగ్‌లో నటించనున్న సాయి పల్లవి..

తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసింది సాయి పల్లవి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

Sai Pallavi : మొదటిసారి అలాంటి సాంగ్‌లో నటించనున్న సాయి పల్లవి..
Sai Pallavi

Updated on: Feb 27, 2024 | 6:03 PM

స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసింది సాయి పల్లవి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. స్కిన్ షోకు నో చెప్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి వరుస సినిమాలతో బిజీగా మారింది సాయి పల్లవి.

సాయి పల్లవికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ్, మళయాలంలో సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో కానీ రొమాంటిక్ సాంగ్స్ లోనూ నటించలేదు. లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్యకు ముద్దు పెట్టె సీన్ ఉంది. కానీ అది రియల్ గా పెట్టింది కాదని క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మొదటిసారి రొమాంటిక్ సాంగ్ లో నటిస్తుందని తెలుస్తోంది.

సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తుంది. మత్యకారుల జీవితకథల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది. శివ కార్తికేయన్ సరసన నటిస్తుంది. రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జవాన్ గా కనిపించనున్నాడు శివ కార్తికేయన్. ఈ సినిమాలో శివకార్తికేయన్‌ భార్యగా నటిస్తుంది సాయి పల్లవి. అలాగే ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందట. ఇప్పటివరకు సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో.. సాంగ్స్ లో నటించలేదు. కథ అవసరం మేరకు సాయి పల్లవి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రావాల్సి ఉంది.

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.