పాపం పూజా పాప.. ఆ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ నుంచి అమ్మడు అవుట్.. ఆమె ప్లేస్‌లో పాన్ ఇండియా బ్యూటీ..
హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది.

పూజా హెగ్డే.. ఈ ముద్దుగుమ్మ బ్యాడ్ లక్‌ను హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని తిరుగుతుందా అనిపిస్తుంది. రీసెంట్ డేస్ లో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఏ భాషలో నటించినా ఆ సినిమాలు హిట్ అవడం లేదు.. గత కొద్దిరోజులుగా పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే వరుస హిట్లే కాదు.. ఆ తర్వాత వచ్చిన ప్లాపులు అమ్మాడి కెరీర్ ను అయోమయంలో పడేశాయి. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో పూజా సైలెంట్ అయ్యింది. కొన్నాళ్లుగా తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది.
ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!
అక్కడ కూడా ప్లాపులే ఎదురుకావడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయని తెలుస్తుంది. ఇటీవలే పూజా హెగ్డేకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్. దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటిస్తున్న కాంచన 4 సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం సర్కిల్‌లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పూజా స్థానంలోకి మరో ముద్దుగుమ్మను సెలక్ట్ చేశారని తెలుస్తుంది.
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న పూజా హెగ్డే కు కాంచన 4 బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ సినిమాతో పూజాహెగ్డే బ్యాడ్ లక్ వదిలి తిరిగి హిట్ ట్రాక్ లోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంచన 4లోకి మరో హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ రష్మిక. పూజా ప్లేస్ లో కాంచన 4లో రష్మిక నటిస్తుందని టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం రష్మికాకు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే రష్మికాను కంచన4 లోకి తీసుకున్నారని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో రష్మిక దయ్యంగా కనిపించనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




