Puneeth Raj Kumar: పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు.. అయితే కొంతమంది మరణించి చిరంజీవులు. తాము చేసిన పనులతో ప్రజల మనసులో సదా నివసిస్తుంటారు. మంచి తనం, మానవత్వం తో బతికి ఉన్న సమయంలో చేసే పనులతో ప్రజలు మనసులో జ్ఞాపకాలుగా వెలుగుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తిలో ఒకరు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించిన పునీత్ బతికి ఉన్నప్పుడు బహుశా కన్నడ వారికీ మాత్రమే తెలుసు.. అయితే మరణించిన తర్వాత పునీత్ చేసిన మంచి పనులు వెలుగులోకి వచ్చి.. కోట్లాది భారతీయులు తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన మరణాన్ని తలచుకుని కన్నీరు పెడుతూనే ఉన్నారు. పునీత్ చేస్తున్న మంచి పనులను తాము కొనసాగిస్తామని కుటుంబ సభ్యులతో పాటు, హీరో విశాల్ వంటివారు కూడా ముందుకొస్తున్నారు.
అయితే తాజాగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ జీవితం వెండి తెరపై సినిమాగా తెరకెక్కడానికి ప్రయత్నాలు మొదలయినట్లు టాక్ వినిపిస్తోంది. నటుడిగా మెప్పించిన అప్పు.. మరోవైపు నిజజీవితంలో అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ… ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు అప్పు బయోపిక్ చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు సంతోష్ కు పునీత్ మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇద్దరి కాంబో శాండల్ వుడ్ లో సూపర్ హిట్. ఈ నేపధ్యంలోకి తాజాగా పునీత్ అభిమాని సునీల్ ట్విటర్ వేదికగా పునీత్ బయోపిక్ చేయాలంటూ దర్శకుడు సంతోష్ ఆనందారంను కోరారు. మీరు అప్పుని ఎంతో దగ్గరగా చూశారు. ఆయన గురించి మీకు ఎన్నో విషయాలు తెలుసు.. ఆయన మనుషుల్ని ప్రేమించే విధానం, నైతిక విలువ గురించి మీకంటే ఎవరికీ తెలియదు.. కనుక సర్ .. అప్పు జీవితాన్ని వెండి తెరపై దృశ్యమాలికగా చూపించండి అంటూ ట్విట్ చేశాడు సునీల్.
సునీల్ ట్విట్ కు స్పందించిన సంతోష్.. తన దృష్టిలో అప్పు సర్ ఎప్పటికి బతికే ఉన్నారని.. అయితే ఆయనని తెరమీద చూపించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. పునీత్, సంతోష్ కాంబోలో తెరకెక్కిన ‘రాజకుమార’, ‘యువరత్న’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్న సమయంలో పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
I’ll try my level best to bring this idea on screen ? #appusirliveson https://t.co/ivcPkm7HyF
— Santhosh Ananddram (@SanthoshAnand15) November 21, 2021
Also Read: ఇన్సులిన్ వాడుతున్న షుగర్ పేషెంట్స్‌కు సైతం మంచి మెడిసిన్.. మెంతులు, మెంతికూర అంటున్న నిపుణులు