పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు పవన్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాలో నటిస్తున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సాహో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను అలరించింది . ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నాడు. అలాగే కలకత్తా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది.
పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు కొన్ని సినిమాలకు తన వాయిస్ కూడా ఇచ్చాడు. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. అలాగే తన సినిమాల్లో కొన్ని పాటలు కూడా పాడారు.జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో పాటలు పాడారు పవన్. ఇక ఇప్పుడు ఇప్పుడు మరోసారి తన వాయిస్ వినిపించనున్నాడని తెలుస్తోంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తన వాయిస్ వినిపించనున్నారట. ఓజీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ తో ఈ సినిమాలో ఓ పాట పాడించాలని తమన్ ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ పాటతో ఫ్యాన్స్ థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం అంటున్నారు అభిమానులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.