NTR: బంపర్ ఆఫర్ కొట్టేసిన మంచు లక్ష్మీ.. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు అక్కగా నటించే ఛాన్స్
విదేశాల్లోనూ ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కొరటాల. ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే దేవర సినిమాలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా పెరిగిపోయింది. విదేశాల్లోనూ ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కొరటాల. ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే దేవర సినిమాలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్ మూవీ పై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చెక్కారు కొడుతోంది. ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారట. ఈ క్రమంలోనే నటి, నిర్మాత ఆయన మంచు లక్ష్మీ దేవర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ ఎన్టీఆర్ అక్కగా నటిస్తున్నారని టాక్.
ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే తారక్, మంచు లక్ష్మీ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక దేవర సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని కూడా టాక్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆ అండర్ వాటర్ లో ఓ ఫైట్ సీన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దేవర మూవీ షూటింగ్ ఇప్పుడు గోవాలో జరుగుతుందని తెలుస్తోంది. అక్కడ ఓ కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేశారట కొరటాల. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Our #Devara @tarak9999 arrives at the sea shore to join the Goa schedule from today. 🌊
— Devara (@DevaraMovie) October 28, 2023
దేవర మూవీ ట్విట్టర్ పోస్ట్
The deadliest weapon in the world is the hand holding the weapon ❤️🔥
Team #Devara wishes you all a very Happy Dussehra 🔥 pic.twitter.com/2MU8rcs8gk
— Devara (@DevaraMovie) October 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.