Prabhas: దీపికా మిస్ చేసుకుంది.. ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది.. ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్

ప్రభాస్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తో సినిమా చేస్తే లాభాలు గ్యారెంటీ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తుంటాయి. దాంతో ఆయనతో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. అంతేకాదు ప్రభాస్ కు రూ. 200కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

Prabhas: దీపికా మిస్ చేసుకుంది.. ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది.. ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్
Prabhas

Updated on: May 23, 2025 | 1:12 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‏లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించనున్నారు.

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో దీపికా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని  ఈ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. దీపికా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని దాంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. సందీప్ తన సినిమాల్లో నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకుంటాడని, సినిమాకు నష్టం జరిగే అవకాశం ఉంటే ఎవరినైనా పక్కన పెట్టడానికి వెనుకాడడని టాక్ ఉంది.

అయితే దీపికా తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీపికా రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందని అలాగే సినిమా లాభాల్లో వాటా అడిగిందని..అలాగే  8 గంటల వర్కింగ్ షిఫ్ట్, తెలుగు డైలాగులు చెప్పడానికి నిరాకరణ వంటి షరతులు వల్ల డిఫరెన్సెస్ వచ్చాయని. ఈ షరతులు సందీప్‌కు నచ్చలేదని అందుకే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి కన్నడ కస్తూరి ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు ఆమె ఎవరో కాదు రుక్మిణి వసంత్ . ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి