Deepika Padukone: కల్కితో టాలీవుడ్‌లోకి దీపికా గ్రాండ్ ఎంట్రీ.. సినిమాకు హైలైట్‌గా అమ్మడి యాక్షన్

డైరెక్ట్‌గా మన రెబల్‌ స్టార్‌ సినిమాలో నటిస్తుండటంతో గ్రాండ్‌గా వెల్‌ కం పలికేందుకు రెడీ అవుతున్నారు ఆడియన్స్‌. ప్రజెంట్‌ బీటౌన్‌లో నెంబర్ హీరోయిన్‌ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు దీపిక పదుకోన్‌. వరుసగా కమర్షియల్‌ బ్లాక్ బస్టర్స్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ, స్టార్ ఇమేజ్‌ వచ్చిన తరువాత ఒక్క సౌత్ సినిమా కూడా చేయలేదు.

Deepika Padukone: కల్కితో టాలీవుడ్‌లోకి దీపికా గ్రాండ్ ఎంట్రీ.. సినిమాకు హైలైట్‌గా అమ్మడి యాక్షన్
Deepika Padukone

Updated on: May 23, 2024 | 3:56 PM

కల్కి సినిమాతో తొలిసారిగా సౌత్ ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపిక పదుకోన్‌. ఇప్పటి వరకు డబ్బింగ్‌ సినిమాలతోనే మన ఆడియన్స్‌కు చేరువైన ఈ బ్యూటీ, ఇప్పుడు డైరెక్ట్‌గా మన రెబల్‌ స్టార్‌ సినిమాలో నటిస్తుండటంతో గ్రాండ్‌గా వెల్‌ కం పలికేందుకు రెడీ అవుతున్నారు ఆడియన్స్‌. ప్రజెంట్‌ బీటౌన్‌లో నెంబర్ హీరోయిన్‌ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు దీపిక పదుకోన్‌. వరుసగా కమర్షియల్‌ బ్లాక్ బస్టర్స్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ, స్టార్ ఇమేజ్‌ వచ్చిన తరువాత ఒక్క సౌత్ సినిమా కూడా చేయలేదు.

కల్కి 2898 ఏడీతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించబోతున్నారు దీపిక. గ్లోబల్ కాన్సెప్ట్ కావటం, ఇండియన్ సూపర్‌ స్టార్ ప్రభాస్ హీరో కావటం, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో తెరకెక్కుతుండటంతో కల్కిలో నటించేందుకు వెంటనే ఓకే చెప్పారు దీపిక.

ఇప్పటికే హాలీవుడ్ సినిమాల్లో నటించిన దీపిక, కల్కి సినిమాకు గ్లోబల్ ఇమేజ్‌ తీసుకురావటంలో హెల్ప్ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. దీనికితో దీపికకు ఆల్రెడీ యాక్షన్ మూవీస్‌ చేసిన అనుభవం కూడా ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ కూడా కల్కికి హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు. కల్కి సినిమా  జూన్ 27 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. అలాగే దిశా పటాని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమానుంచి బిజీ అనే చిట్టి రోబోట్ ను కూడా పరిచయం చేశారు. ఈ రోబోకు సస్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ వాయిస్ ఇచ్చారు. ఈ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.