వారాంతం వచ్చిందంటే చాలు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉన్నారు. మొత్తం 14 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. వారిలో మొదటి వారం కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆతర్వాత రెండో వారంలో షకీలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు మూడో వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ వారం హౌస్ నుంచి ఓ లేడీ బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 12 మందిలో పవర్ ఆస్ట్ర సొంతం చేసుకొని ఆట సందీప్, శివాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా నిలిచారు. అలాగే ఈ వారం మూడోవ పవర్ అస్త్రను గెలుచుకునేందుకు హౌస్ లో ఉన్నవారు పోటీపడుతున్నారు.
ఇదిలా ఉంటే హౌస్ నుంచి బయటకు సారి దామిని వెళ్తుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డామినితో పాటు గౌతమ్ కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దామిని, గౌతమ్ లకు ఓటింగ్ తక్కువగా వచ్చిందని తెలుస్తోంది. దామిని ముందు నుంచి టాస్క్ ల్లో సరిగ్గా పాల్గొనడం లేదని ఆమె పై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
దామిని సేఫ్ గేమ్ ఆడుతుందని ప్రేక్షకులకు అర్ధమవుతుంది. శివాజీ కూడా ఈ విషయాన్ని తెలిపాడు. ప్రేక్షకులకు కూడా దామిని సేఫ్ గేమ్ ఆడుతుందని అందుకనే ఆమెకు తక్కువ ఓటింగ్ వచ్చిందని తెలుస్తోంది. దామిని కేవలం వంటలు చేస్తూ గౌతమ్ కూడా బిగ్ బాస్ లో అంతగా పర్ఫామ్ చేయడం లేదు. నాగార్జున కూడా గౌతమ్ పర్ఫామెన్స్ పై కామెంట్స్ చేశాడు. అలాగే హౌస్ లో ఉన్నవారితో వాదిస్తూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాడు. దాంతో ఈసారి హౌస్ నుంచి దామిని కానీ గౌతమ్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. అలాగే ఈ వారంలో వైల్డ్ కార్డు ద్వారా చాలా మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మూడో వారం హౌస్ లో బాగానే గొడవలు జరిగాయి. శనివారం నాగ్ హౌస్ లో ఉన్నవారికి క్లాస్ తీసుకోవడం ఖాయం. ముఖ్యంగా రతికా పాప హౌస్ లో ఉన్నవారందరితో గొడవలు పెట్టుకుంటూ రచ్చ చేసింది. అలాగే గౌతమ్ కూడా శోభ శెట్టితో గొడవ పెట్టుకొని ఏకంగా షర్ట్ విప్పి హల్ చల్ చేశాడు దీనిపై కూడా నాగ్ క్లాస్ తీసుకునే ఛాన్స్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.