AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ కోసం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెయిటింగ్.. రాజమౌళి సినిమా తర్వాత ఆయనతోనే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

Mahesh Babu: మహేష్ కోసం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెయిటింగ్.. రాజమౌళి సినిమా తర్వాత ఆయనతోనే..?
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: May 18, 2025 | 8:58 AM

Share

దర్శక ధీరుడు రాజమౌళి ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ పై నెట్టింట పెద్దెత్తున చర్చ జరుగుతుంది. మహేష్ బాబు లాంగ్ హెయిర్ , గుబురు గడ్డంతో మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మరికొంతమంది స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు చియాన్ విక్రమ్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్.

అయితే రాజమోళి సినిమా ఒక పార్ట్ గా వస్తుందా.? లేక రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గ మారింది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరోతో సినిమా చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఓ యంగ్ డైరెక్టర్ రెడీగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు బుచ్చిబాబు. ఈ స్టార్ డైరెక్టర్ చేసింది ఒక్క సినిమానే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఉప్పెన సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు రూ. 100కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సినిమా చేస్తున్నారు. పెద్ది అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహేష్ కోసం మరో మాస్ స్టోరీని రెడీ చేశారట బుచ్చిబాబు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!