‘Ayyappanum Koshiyum’ remake: గురూజీ ఎందుకు వెనక్కి తగ్గారు.. ఫ్యాన్స్ మదిలో అంతుచిక్కని ప్రశ్నలు

|

Jan 18, 2021 | 7:07 PM

పవన్ హీరోగా తెరకెక్కుతున్న 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ టీంతో త్రివిక్రమ్ జాయిన్ అవుతున్నారు. ఈ విషయాన్ని సంక్రాంతి పండుగ రోజు గ్రాండ్‌గా ఎనౌన్స్ చేశారు మేకర్స్‌.

Ayyappanum Koshiyum remake: గురూజీ ఎందుకు వెనక్కి తగ్గారు.. ఫ్యాన్స్ మదిలో అంతుచిక్కని ప్రశ్నలు
Follow us on

పవన్ హీరోగా తెరకెక్కుతున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ టీంతో త్రివిక్రమ్ జాయిన్ అవుతున్నారు. ఈ విషయాన్ని సంక్రాంతి పండుగ రోజు గ్రాండ్‌గా ఎనౌన్స్ చేశారు మేకర్స్‌. ఈ రీమేక్‌కు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు మాటల మాంత్రికుడు. అయితే ఈ రెండు పనులు భుజాన వేసుకున్న గురూజీ దర్శకత్వం మాత్రం ఎందుకు చేయటంలేదు.

పవన్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా అజ్ఞాతవాసికి దారుణమైన రిజల్ట్ వచ్చింది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్‌ మీద కాపీ విమర్శలతో పాటు మేకింగ్, టేకింగ్‌ కూడా సరిగా లేదన్న కామెంట్స్ వినిపించాయి. ఆ ఎఫెక్ట్‌తోనే పవన్‌ నెక్ట్స్‌ సినిమాకు గురూజీ దర్శకత్వం చేయటం లేదా అని డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజెన్లు.

ప్రజెంట్ త్రివిక్రమ్ అంత బిజీగా ఏం లేరు.. లైన్‌ లో ఉన్న ఎన్టీఆర్ సినిమా కూడా ఇప్పటికిప్పుడే పట్టాలెక్కే పరిస్థితి లేదు. ట్రిపులార్‌ షూటింగ్ పూర్తయితేగానీ ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కదు. అలాంటప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వ బాధ్యతలు ఎందుకు తీసుకోలేదు అన్న ఆలోచనలో పడ్డారు పవన్‌ ఫ్యాన్స్‌. అజ్ఞాతవాసి ఫెయిల్యూర్‌ను మరిపించే ఛాన్స్ వచ్చినా త్రివిక్రమ్ కొన్ని విభాగాలకే పరిమితమవ్వటం ఏంటని ఫీలవుతున్నారు. మరి ఈ చర్చ గురూజీ దాకా వెళ్లిందో లేదో..!

Also Read:

Chiru 153: చిరు సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌కు ఓకే చెప్పిన నయన్.. ఫిలిం సర్కిల్స్‌లో హాట్, హాట్ డిస్కషన్

Rebel Star Prabhas: డార్లింగ్ షాకింగ్ డెసిషన్.. ఏకంగా ఐదారు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ !