AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: ‘పెద్ది’ మూవీ విజయం.. ఎవరి కెరీర్‌కి ఎంత కీలకం..?

Peddi Movie: పెద్ది మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విజయం కేవలం కలెక్షన్లకే కాకుండా, ఇందులో పనిచేసిన పలువురి కెరీర్‌లకు కూడా కీలకంగా మారబోతోందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.

Peddi Movie: 'పెద్ది' మూవీ విజయం.. ఎవరి కెరీర్‌కి ఎంత కీలకం..?
Ram Charan's Peddi Movie
Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 07, 2026 | 6:44 PM

Share

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విజయం కేవలం బాక్సాఫీస్ నంబర్లతోనే ముడిపడి లేదు. అంతకు మించి, అందులో పని చేసిన వారి కెరీర్‌కి అత్యంత కీలకం. ఇంతకీ ‘పెద్ది’ సక్సెస్‌ కోసం అమితాసక్తితో వెయిట్‌ చేస్తున్నదెవరు? చదివేయండి..

1. మెగా వపర్‌ క్రేజ్‌

‘ట్రిపుల్‌ ఆర్‌’ తర్వాత రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఆ వెంటనే రిలీజ్‌ అయిన ‘ఆచార్య’, ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆశించిన స్థాయిలో మెప్పించి ఉంటే, ఇప్పుడు సిట్చువేషన్‌ ఇంకోలా ఉండేది. కానీ అలా జరగలేదు. అందుకే చరణ్‌కు ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ అవసరం. ‘పెద్ది’ సినిమా ఆ హిట్‌ను తెచ్చిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మెగాపవర్‌స్టార్‌ ఫ్యాన్స్. ఈ మధ్య రిలీజ్‌ అయిన బర్త్ డే గ్లింప్స్ లో చెర్రీ లుక్‌ వావ్‌ అనిపించింది. ”ఇప్పటి వరకు రామ్‌చరణ్‌ కెరీర్‌లో అత్యుత్తమ నటన ‘రంగస్థలం’ మూవీలోనే! ‘పెద్ది’లో అంతకు మించిన నటుడిని చూడబోతున్నాం” అంటూ రీసెంట్‌గా సుకుమార్‌ ఊరించారు. వేల్యూ యాడెడ్‌ విషయాల సంగతి పక్కనపెడితే ‘పెద్ది’ బంపర్‌ హిట్‌ అయి బిగ్‌ నెంబర్స్ తీసుకురావడం ఎంత ముఖ్యమో.. అంతకన్నా ముఖ్యం చరణ్‌కి ఈ సినిమా విజయవంతం కావడం!

2. ద్వితీయ విఘ్నం…

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు తీస్తున్న రెండో సినిమా ‘పెద్ది’ టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే వంద కోట్ల కలెక్షన్లు చూసిన రేర్‌ రికార్డు బుచ్చిబాబు ఖాతాలో ఉంది. ఆ సక్సెసే ఆయన్ని మెగా పవర్‌స్టార్‌కి దగ్గర చేసింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ మూవీని భారీగా రిలీజ్‌ చేస్తున్నారు. సో, ‘పెద్ది’ సక్సెస్‌తో ప్యాన్‌ ఇండియా డైరక్టర్ల ఖాతాలో ఎంట్రీ ఇవ్వాలి బుచ్చిబాబు. అదే జరగాలంటే సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావాల్సిందే.

3. నిలదొక్కుకోవాలిగా..!

శ్రీదేవి వారసురాలిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌కి ఇక్కడ బలమైన పునాది పడాలి. ‘దేవర’ తర్వాత ఆమెకు దక్కిన పెద్ద అవకాశం ‘పెద్ది’ . కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, ఈ సినిమాలో ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందని టాక్. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాలంటే జాన్వీకి ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. ఈ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న శ్రుతిహాసన్‌కి కూడా ‘పెద్ది’ సక్సెస్‌ కీలకమే.

4. ఒక్క సక్సెస్‌..!

తెలుగులో ఒక్క సక్సెస్‌ కోసం చాలా ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు ఆస్కార్‌ వీరుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. జస్ట్ వెయిట్‌ చేయడం మాత్రమే కాదు, దానికి తగ్గ పనితనం కూడా చూపిస్తున్నారు. ‘పెద్ది’ సాంగ్స్ కి మెస్మరైజ్‌ అవుతున్నారు ఫ్యాన్స్. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌లోనూ రెహమాన్‌ మ్యాజిక్‌ కనిపిస్తుందనే వార్తలున్నాయి. అన్నీ కలిపి సినిమాను సక్సెస్‌ చేస్తే అదే చాలంటున్నారు రెహమాన్‌.

5. పైసా వసూల్‌

‘పెద్ది’ సినిమా హీరో హీరోయిన్లకు, డైరక్టర్‌కీ, మ్యూజిక్‌ డైరక్టర్‌కి మాత్రమే కాదు.. నిర్మాతకు కూడా హిట్‌ కావాలి. వృద్ధి సినిమాస్‌ పతాకంపై అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. సంస్థ వేల్యూ పెరగాలంటే ఈ మూవీ క్లిక్‌ కావాల్సిందే. తాను డైరక్ట్ చేయకపోయినా, ఓ పెద్ద హీరో సినిమా నిర్మాణంలో అసోసియేట్‌ కావడం సుకుమార్‌కి కూడా సవాలే. ఈ సినిమా సక్సెస్‌ సుకుమార్‌కి కూడా చాలా కీలకం. ఇంతమందికి ఇన్ని రకాలుగా ముఖ్యం కాబట్టే, జూన్‌ 4న లిట్మస్‌ టెస్ట్ కి రెడీ అవుతోంది ‘పెద్ది’ టీమ్‌. అన్నట్టు ఆల్రెడీ 30 రోజుల రిలీజ్‌ కౌంట్‌డౌన్‌ కూడా షురూ అయిందండోయ్‌!

Follow Us