ప్రముఖ టెలివిజన్ డ్యాన్స్ షో ‘ఢీ’ నుంచి యాంకర్ ప్రదీప్ అనూహ్యంగా మిస్ అయ్యాడు. దీంతో అతను లేని ఫీలింగ్ షో రేటింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. చాలా మంది ప్రదీప్ ఏమయ్యాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఇది అడ్వాంటేజ్ తీసుకున్న కొంతమంది ఢీ నుంచి ప్రదీప్ మానేశాడని, మరికొందరు అతను తీవ్ర అనారోగ్యానికి పుకార్లు సృష్టించారు. అసలు విషయం ఏంటనేది క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌కు జడ్జ్ నాగబాబు సహా కొన్ని గ్యాంగ్‌లు గుడ్ బై చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ కూడా ఆ బ్యాచ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. రెండు ప్రొగ్రామ్స్‌ను ఆర్గనైజ్ చేసేది మల్లెమాల సంస్థ కావడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం లభించింది. వీడియో బైట్ రిలీజ్ చేసిన ప్రదీప్ వాటిని ఖండించినప్పటికి రూమర్స్ మాత్రం ఆగలేదు.
ఇలా ఉండగానే ప్రదీప్ హైపర్ ఆదితో కలిసి ఢీకి మరోసారి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. దీనిపై స్పష్టత తీసుకునేందుకు టీవీ9 ఎంటర్టైన్మెంట్ టీం ప్రయత్నించింది. నిజానికి ప్రదీప్ కాలికి గాయం వల్ల సర్జరీ చేయించుకోవడంతోనే అతను షోకి దూరమయ్యాడట. అయితే ప్రదీప్ మొదట్లోనే మల్లెమాల, ఈటీవీలతో పాటు బయట కూడా షోస్ చేసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అందుకే అతను జీ తెలుగులో పలు షోస్‌కి , కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా కనిపించాడు. అందుకే అతను జీ తెలుగులో కొత్త షో చేస్తున్నా కూడా మల్లెమాల కానీ, ఈటీవీ గానీ ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. దీంతో అతను సర్జరీ తర్వాత రెస్ట్ అయిపోయిన అనంతరం మళ్లీ ఎప్పట్లానే వ్యాఖ్యాతగా కంటిన్యూ అవుతున్నాడు. సో ఇదన్నమాట ప్రదీప్ రీ ఎంట్రీ వెనకున్న సంగతి.