“నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి నీకెందుకు”

అందానికి చిరునామా అన‌సూయ‌. ఆమె ఎంత స‌ర‌దాగా ఉంటారో తన గురించి కానీ, తన లైఫ్‌స్టైల్‌‌ గురించి కానీ ఎవ‌రైనా త‌ప్పుగా మాట్లాడితే అంతే లెవ‌ల్ లో స‌మాధానం చెబుతారు. తనపై అస‌భ్య‌క‌ర‌ వ్యాఖ్యలు చేసిన వారికి ఘాటుగా ఆన్స‌ర్ ఇచ్చి ఇప్పటికే పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా తన డ్రెస్సింగ్ గురించి కామెంట్‌ చేసిన ఓ ఫ్యాన్ ని లైవ్ లోనే క‌డిగిపారేశారు అన‌సూయ‌. “నా డ్రెస్సింగ్‌ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి” అంటూ […]

నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి నీకెందుకు

Updated on: May 17, 2020 | 7:17 PM

అందానికి చిరునామా అన‌సూయ‌. ఆమె ఎంత స‌ర‌దాగా ఉంటారో తన గురించి కానీ, తన లైఫ్‌స్టైల్‌‌ గురించి కానీ ఎవ‌రైనా త‌ప్పుగా మాట్లాడితే అంతే లెవ‌ల్ లో స‌మాధానం చెబుతారు. తనపై అస‌భ్య‌క‌ర‌ వ్యాఖ్యలు చేసిన వారికి ఘాటుగా ఆన్స‌ర్ ఇచ్చి ఇప్పటికే పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా తన డ్రెస్సింగ్ గురించి కామెంట్‌ చేసిన ఓ ఫ్యాన్ ని లైవ్ లోనే క‌డిగిపారేశారు అన‌సూయ‌. “నా డ్రెస్సింగ్‌ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి” అంటూ ఘాటుగానే ప్ర‌శ్నించారు.

ఇటీవల తన బ‌ర్త్ డే సంద‌ర్భంగా అనసూయ ఫ్యామిలీతో కలిసి కొంత సమయం ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్లతో మాట్లాడారు. తన ఇష్టాయిష్టాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇంతలో ఓ నెటిజన్‌ అనసూయను నువ్వు అని సంబోధించాడు. దీంతో ఆమె కొంచెం అసహనానికి గుర‌య్యారు.

“మనకి తెలియని వ్యక్తిని ఎప్పుడూ ఏకవచనంలో పిల‌వ‌కూడ‌దు. వాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు కాదు మీరు అని పిలవడం నేర్చుకోండి. మనకు బాగా దగ్గరైన వ్య‌క్తుల్ని మాత్రమే ఏకవచనంలో పిలవాలి” అని యాంక‌ర్ అన‌సూయ అభిప్రాయ‌ప‌డ్డారు.

మరో అభిమాని “మంచి డ్రెస్‌ వేసుకోండి. మీరు ఇద్దరు పిల్లలకి తల్లి అని మర్చిపోకండి” అని కామెంట్‌ పెట్టాడు. దీంతో అనసూయ అతడిపై ఫైర్ అయ్యింది. “నా డ్రెస్‌ గురించి డిస్క‌స్ చెయ్య‌డానికి నువ్వు ఎవరివి… నీకసలు అమ్మతనం అంటే తెలుసా? ఓ అమ్మ‌ ఎలా ఉండాలో, ఏ దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి నువ్వు ఎవరు? ఇది ఒక అమ్మ జీవితం. తాను అనుకున్న‌ విధంగా జీవించే హక్కు తనకి ఉంది. నాకు నచ్చినట్టు, అందంగా కనిపించేటట్టు నేను బ‌ట్టులు వేసుకుంటా.” అని అనసూయ ఘాటుగా ఆన్స‌ర్ ఇచ్చారు.