
కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాను సూపర్ హిట్ చేసేస్తారు తెలుగు అడియన్స్. స్టార్ నటీనటులు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్నారు యంగ్ డైరెక్టర్స్. ఇక ఇప్పుడు టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష సైతం హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు. వైవా షార్ట్ ఫిల్మ్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష. ఆ తర్వాత సినిమాల్లో సహాయ నటుడిగా కనిపిస్తూ మెప్పించాడు. కమెడియన్‌గా.. హీరో స్నేహితుడిగా కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు హర్ష హీరోగా తెరకెక్కిన సినిమా ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు కళ్యాణ్ సంతోష్. టీజర్, ట్రైలర్‌తోనే సినిమా పై ఆసక్తిని కలిగించారు మేకర్స్. ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
విడుదలకు ముందే సినిమాపై క్యూరియాసిటిని కలిగించారు మేకర్స్. ఇక విడుదలైన ఫస్ట్ డే ఉదయాన్నే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రపంచానికి సంబంధం లేకుండా అడవిలో ఓ పల్లెటూరికి ఇంగ్లీష్ మాస్టర్ గా వెళ్లి సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు.. నేర్చుకున్న జీవిత పాఠాలతో ఈ సినిమాతోనే సాగుతుంది. అయితే హీరోగా మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నాడు హర్ష. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ. 2.03 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. చిన్న సినిమా.. ఎలాంటి అంచనాలు లేని మూవీ.. కమెడియన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ డే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. హీరోగా ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ గురించి తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
కథ విషయానికి వస్తే..
మిర్యాలమెట్ట అనే చిన్న కుగ్రామానికి ఇంగ్లీష్ సబ్జెక్టు చెప్పేందుకు సుందర్ రావు (వైవా హర్ష) వెళతాడు. ఓ సీక్రెట్ మిషన్ తో వెళ్లిన అతడు.. గ్రామంలో ప్రజలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ?..అతను వెళ్లిన పని సక్సెస్ అయ్యిందా ? లేదా ? అనేది సుందరం మాస్టర్ సినిమా.
Small Film – Big Impact 💯@harshachemudu’s Debut Film as Lead Actor ~ #SundaramMaster strikes big at the Box Office with 2.03 CRS+ WW Gross on Day 1 🥳
Experience the ‘CLASS’IC BLOCKBUSTER at your nearest cinemas!
🎟️ https://t.co/ZecUOLh4Gg@RaviTeja_offl @SudheerKurru… pic.twitter.com/Yi5QDKwR1n— RT Team Works (@RTTeamWorks) February 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.