Gaami Twitter Review: ‘గామి’ ట్విట్టర్ రివ్యూ.. అఘోరాగా విశ్వక్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా ?..

|

Mar 08, 2024 | 6:49 AM

ఈ మూవీకి విధ్యాధర్ కాగిత దర్శకత్వం వహించగా.. కలర్ ఫోటో ఫేమ్ చాందినీ చౌదరి కథానాయికగా నటించింది.. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాపై డైరెక్టర్ రాజమౌళి చేసిన ట్వీట్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేసింది. 'కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి' అంటూ గామి సినిమాపై జక్కన్న ట్వీట్ చేయడంతో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది.

Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. అఘోరాగా విశ్వక్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా ?..
Gaami Movie
Follow us on

విడుదలకు ముందే ప్రేక్షకులలో ఎక్కువగా ఇంట్రెస్టింగ్ కలిగించిన సినిమా ‘గామి’. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో రాని సరికొత్త కథాంశంతో ఈమూవీని రూపొందించారు. అసలు మానవ స్పర్శే లేని ఓ అఘోరా జీవితమే గామి. ఇప్పటివరకు విశ్వక్ సేన్ నటించిన అన్ని సినిమాలకంటే అత్యంత ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యింది ఈ మూవీ పైనే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. ఈ మూవీకి విధ్యాధర్ కాగిత దర్శకత్వం వహించగా.. కలర్ ఫోటో ఫేమ్ చాందినీ చౌదరి కథానాయికగా నటించింది.. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాపై డైరెక్టర్ రాజమౌళి చేసిన ట్వీట్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి’ అంటూ గామి సినిమాపై జక్కన్న ట్వీట్ చేయడంతో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. మార్చి8న మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్‏గా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈమూవీని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

కథపై నమ్మకంతో దాదాపు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి అద్భుతమైన సినిమాను అందించిన డైరెక్టర్ కార్తీక్ శబరీష్‏కు హ్యాట్సాఫ్. మాకు ఇలాంటి అవుట్ ఫుట్ ఇవ్వడానికి మీరు చేసిన గొప్ప ప్రయత్నం ఇది. సినిమాటోగ్రాఫి అత్యుత్తమంగా ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే అదిరిపోయాయి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

గామి సినిమాలో అఘోరాగా విశ్వక్ యాక్టింగ్ అదుర్స్ అని… సినిమాటోగ్రాఫీ, మ్యూజిక్ హైలెట్ అంటున్నారు. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ వీఎఫ్ఎక్స్ తో వచ్చిన సినిమా గామి అని.. బీజీఎం, లాస్ట్ ట్విస్ట్, లయన్ ఎపిసోడ్ బాగున్నాయని అంటున్నారు. ఇక అభినయ తన నటనతో మరోసారి ప్రశంసలు అందుకుంది. అలాగే సినిమాలోని కొన్ని సీన్స్, సాంగ్స్ గూస్ బంప్స్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. మొదటి 30 నిమిషాల ఇంట్రో మూవీ మెంటల్ మాస్ బీజీఎం అంటున్నారు. మొత్తానికి గామి సినిమాతో విశ్వక్ ఖాతాలో మరో హిట్టు పడ్డేట్టే అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.