మరోసారి కలిసి నటించనున్న ఉప్పెన జోడి.. వైష్ణవ్, కృతి జంటగా మరో సినిమా..

మరోసారి కలిసి నటించనున్న ఉప్పెన జోడి.. వైష్ణవ్, కృతి జంటగా మరో సినిమా..

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే రికార్డులను క్రియేట్ చేసాడు.

Rajeev Rayala

|

Apr 17, 2021 | 12:03 PM

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే రికార్డులను క్రియేట్ చేసాడు. మెగాస్టార్ మేనల్లుడిగా, సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు వైష్ణవ్. సుకుమార్ ప్రియా శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఉప్పెన అనే అందమైన ప్రేమ కథ నటించాడు వైష్ణవ్. సినిమాలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాలో బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

మొదటి సినిమాతోనే అందరు దృష్టించి ఆకర్షించారు వైష్ణవ్ , కృతి. ఈ జంట తెరపై చూడముచ్చటగా అనిపించింది. వైష్ణవ్ తన నటనతో ఆకట్టుకోగా.. కృతి అందం అభినయంతో అలరించింది. చూడటానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉండే కృతి కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఇప్పుడు మరో సారి వైష్ణవ్ కృతి కలిసి నటించనున్నారనని తెలుస్తుంది. ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్, కృతితో కలిసి మరో సినిమాను చేయబోతున్నారంటూ ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. అంతే కాదు ఈ సినిమాను నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఇక మొదటి సినిమా తర్వాత ఈ ఇద్దరు  చాలా బిజీ అయిపోయారు. వైష్ణవ్ ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసి మూడో సినిమాను కూడా మొదలు పెట్టనున్నాడు. అటు కృతి తెలుగులో వరుసగా రామ్, నాని, సుధీర్ బాబు సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. . ఇప్పుడు ఈ జంట మరో సారి కలిసి నటించనున్నారని తెలిసి మెగాఫ్యాన్స్, కృతి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu