Virupaksha: అదరగొట్టిన మెగా మేనల్లుడు.. వందకోట్లు వసూల్ చేసిన విరూపాక్ష

|

May 18, 2023 | 1:33 PM

కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కూడా విరుపాక్షకు మంచి కలెక్షన్ వస్తున్నాయి.

Virupaksha: అదరగొట్టిన మెగా మేనల్లుడు.. వందకోట్లు వసూల్ చేసిన విరూపాక్ష
Virupaksha
Follow us on

సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు. చాలా రోజులగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న తేజ్ రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కూడా విరుపాక్షకు మంచి కలెక్షన్ వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దాంతో విరూపాక్ష సినిమాకు తిరుగు లేకుండా పోయింది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా ఈ నెల 21 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది ఈ మూవీ.

విరూపాక్ష సినిమా 100కోట్లు వసూల్ చేయడంతో చిత్ర యూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా తన ఆనందంని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.