Anushka Sharma: అనుష్కకు అస్వస్థత.. అసలు మ్యాటర్ ఇదే అంటూ వార్తలు.. క్లారిటీ ఇదిగో

|

Feb 13, 2024 | 5:19 PM

అనుష్క రెండో సారి గర్భం దాల్చిందని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల పై క్లారిటీ రాలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. తాజాగా మరోసారి అనుష్క గురించిన వార్తలు వైరల్ గా మారాయి. అయితే అనుష్క ఆరోగ్యంపై ఓ జర్నలిస్ట్ చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు.

Anushka Sharma: అనుష్కకు అస్వస్థత.. అసలు మ్యాటర్ ఇదే అంటూ వార్తలు.. క్లారిటీ ఇదిగో
Anushka Virat Kohli
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. అనుష్క రెండో సారి గర్భం దాల్చిందని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల పై క్లారిటీ రాలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. తాజాగా మరోసారి అనుష్క గురించిన వార్తలు వైరల్ గా మారాయి. అయితే అనుష్క ఆరోగ్యంపై ఓ జర్నలిస్ట్ చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో అనుష్క, విరాట్ పేర్లను ప్రస్తావించారు.

ఆ జర్నలిస్ట్ షేర్ చేసిన పోస్ట్ లో కొన్ని సమస్యల కారణంగా, విరాట్ విదేశాలలో ఉన్న వైద్యుడి వద్ద చికిత్స పొందాలని నిర్ణయించుకున్నాడు, అతని కుటుంబంతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. బీసీసీఐ అనుమతితో ఈసారి తన కుటుంబంతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. వారి సంతోషకరమైన భవిష్యత్తు కోసం మనం ప్రార్థించాలి’. అని ఆయన రాసుకొచ్చారు. దాంతో కొంతమంది అనుష్క ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అస్వస్థత ఏర్పడి ఉండవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులు ఆడడని స్పష్టం చేశారు. ఈ సిరీస్‌లో మొదటి రెండు టెస్టులు ఆడబోనని గతంలోనే చెప్పాడు విరాట్. కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, విరాట్ స్నేహితుడు ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. విరాట్‌, అనుష్క శర్మలు విరాట్‌ రెండోసారి తండ్రి కాబోతున్నారని తెలిపాడు. కొద్ది రోజుల క్రితం ఏబీ డివిలియర్స్ హఠాత్తుగా తన చేసిన వీడియాను డిలీట్ చేశాడు. అంతేకాదు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. తాను పెద్ద తప్పు చేశానని, విరాట్ గురించి ఇచ్చిన సమాచారం తప్పని అన్నాడు. దాంతో విరాట్, అనుష్క ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది.

అనుష్క ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

విరాట్ కోహ్లీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.