మోహన్​బాబు స్టైలిష్ట్​గా మంచు విరోనికా !

ఇప్పుటివరకు భార్యగా, అమ్మగా, ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వర్తించిన మంచు విరోనికా స్టైలిష్ట్‌గా తన సత్తా చాటబోతున్నారు.  అది కూడా  మొదటిసారి తన మామాగారు మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా వ్యవహరించనున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 8:58 pm, Fri, 23 October 20
మోహన్​బాబు స్టైలిష్ట్​గా మంచు విరోనికా !

ఇప్పుటివరకు భార్యగా, అమ్మగా, ఇంటి పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వర్తించిన మంచు విరోనికా స్టైలిష్ట్‌గా తన సత్తా చాటబోతున్నారు.  అది కూడా  మొదటిసారి తన మామాగారు మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా వ్యవహరించనున్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాకు ఆమె స్టైలిష్ట్‌గా పనిచేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో లాంఛనంగా ప్రారంభమైంది.   శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైమండ్‌ రత్నబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్ ప్లే అందించారు.

‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రారంభమైన సందర్భంగా మోహన్‌బాబుకు విషెస్ తెలుపుతూ ఆయన కుమార్తె లక్ష్మీ ఓ ట్వీట్‌ పెట్టారు. “కంగ్రాట్స్‌ నాన్న! దీని కోసం నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా. మీ అద్భుత నటనను వెండితెరపై చూడడానికి ఎంతో ఇంట్రస్ట్‌తో ఉన్నా. ఆల్‌ ది బెస్ట్‌” అని  పేర్కొన్నారు.

Also Read

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

Breaking : మళ్లీ గ్రే జాబితాలోనే పాకిస్థాన్ !