Varanasi: ఆ 30 నిముషాలు అదిరిపోతుంది.. థియేటర్స్‌లో పూనకాలే.. సంచలన విషయాలు చెప్పిన విజయేంద్రప్రసాద్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా ఇది. అలాగే ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు

Varanasi: ఆ 30 నిముషాలు అదిరిపోతుంది.. థియేటర్స్‌లో పూనకాలే.. సంచలన విషయాలు చెప్పిన విజయేంద్రప్రసాద్
Varanasi

Updated on: Jun 06, 2026 | 2:39 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ వారణాసి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం లాంటి ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడం, అలాగే అపజయాలు ఎరుగని దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో వారణాసి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్,  టైటిల్ టీజర్ సినిమా పై అంచనాలను భారీగాపెంచేశాయి. అంతేకాకుండా ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా కథ ఏంటి, రాజమౌళి ఈ సారి ఎలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించనున్నాడని ఆడియన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.

తాజాగా రాజమౌళి తండ్రి, కథ రచయిత విజయేంద్రప్రసాద్ వారణాసి సినిమా స్టోరీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ వారణాసిలో ఒక 30 మినిట్స్ సీక్వెన్స్ ఇండియాను షేక్ చేస్తుందని అన్నారు. కాగా    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ కు వారణాసిలో 30నిమిషాల సీన్ కి సంబందించిన ప్రశ్న ఎదురైంది. దీని గురించి ఆయన మాట్లాడుతూ..

ఆ సీక్వెన్స్ శ్రీరాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం.. మీకు ట్రైలర్ లో చూపించారుగా.. రాముడు వనరుల మీద నిలబడి కుంభకర్ణుడితో యుద్ధం చేస్తున్నట్టు ఉంటుంది. అందులో హనుమంతుడితోకపై రధం కూడా కనిపించించిందిగా.. అదే స్పెల్ బౌండ్ అని విజయంద్రప్రసాద్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే వారణాసి సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. రుద్ర పాత్రతోపాటు శ్రీరాముడిగానూ కనిపించనున్నాడని అంటున్నారు.ఇక వారణాసిలో మందాకినిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జోనాస్ అలాగే కుంభ అనే నెగెటివ్ రోల్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి సినిమాను విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీమ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us