Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: చెన్నైలో వరదల బీభత్సం.. సాయం చేయాలంటూ అభిమానులకు విజయ్ దళపతి విజ్ఞప్తి..

చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో సహాయక సిబ్భంది శ్రమిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత మూడ్రోజులుగా భారీ వర్షాలతో రోడ్లు, స్టేషన్స్ దెబ్బతినడంతో పునరుద్దరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు బయటకు వచ్చి వర్షపు నీటిని తొలగిస్తున్నారు. ఇటు సెలబ్రెటీస్ సైతం వరదల బీభత్సం గురించి ట్వీట్స్ చేస్తూ..ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలంటూ అభిమానులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం హీరో సూర్య, కార్తి ఆర్థిక సాయమందించగా.. వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్ , హీరో విష్ణు విశాల్ వద్దకు చేరుకుని తగినంత సాయం చేశారు హీరో అజిత్.

Vijay Thalapathy: చెన్నైలో వరదల బీభత్సం.. సాయం చేయాలంటూ అభిమానులకు విజయ్ దళపతి విజ్ఞప్తి..
Vijay Thalapathy
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2023 | 5:52 PM

మిచౌంగ్ తుఫాన్ కారణంగా చెన్నై సహా ఇతర జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో, వరదలతో అతలాకుతుమైపోయింది. ఇళ్లు, రోడ్లు, ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో సహాయక సిబ్భంది శ్రమిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత మూడ్రోజులుగా భారీ వర్షాలతో రోడ్లు, స్టేషన్స్ దెబ్బతినడంతో పునరుద్దరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు బయటకు వచ్చి వర్షపు నీటిని తొలగిస్తున్నారు. ఇటు సెలబ్రెటీస్ సైతం వరదల బీభత్సం గురించి ట్వీట్స్ చేస్తూ..ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలంటూ అభిమానులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం హీరో సూర్య, కార్తి ఆర్థిక సాయమందించగా.. వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్ , హీరో విష్ణు విశాల్ వద్దకు చేరుకుని తగినంత సాయం చేశారు హీరో అజిత్. ఇప్పుడు హీరో దళపతి విజయ్ సైతం చెన్నై వరదల గురించి ట్వీట్ చేశాడు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. తమకు సమీపంలో ఉన్నవారికి ప్రభుత్వంతో కలిసి సాయం చేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు విజయ్.

“మిచౌంగ్ తుఫాన్ కారణంగా చెన్నై, అళాగే శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. పిల్లలు, పెద్దలు కనీస సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగు నీరు, ఆహారం, ఇతర మౌలిక సదుపాయాలు లేకుండా వేలాంది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను తిరిగి సురక్షిత ప్రాంతాలకు తరలించారని అనేకమంది సోషల్ మీడియాలో కోరుతున్నారు. ప్రభుత్వంతోపాటు.. స్వచ్ఛంద సేవకులుగా పాల్గొనాలని విజయ్ మక్కల్ ఇయక్కం సంస్థ సభ్యులను (తన అభిమాన సంస్థలను) కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు విజయ్. ప్రస్తుతం విజయ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. అభిమానులు స్పందిస్తున్నారు.

సూర్య, కార్తీ, హరీష్ కళ్యాణ్, పార్తీబన్, చిన్నత్రాయ్ నిషా, చిన్నత్రాయ్ బాల ఇలా చాలా మంది ఇప్పటికే వరద బాధితులకు తమవంతు సాయమందించారు. అలాగే క్రికెటర్ డెవిడ్ వార్నర్ సైతం చెన్నై వరదల పై స్పందించారు. చెన్నైలోని వరద ప్రాంతాలు చూసిన తర్వాత తన ఆలోచనలు ప్రకృతి వైపరీత్యాల బాఘధితులపైనే ఉన్నాయిని.. అందరూ సురక్షితంగా ఉండాలని.. వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేయాలని కోరాడు.

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

ఇదిలా ఉంటే.. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే లియో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు విజయ్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో త్రిష కథానాయికగా నటించగా..బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ధ సూపర్ హిట్ అయ్యింది.