స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికావోస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడు ఆగస్ట్ 13 నుంచి 15 వరకు తమ ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయాలని ప్రధాని మోదీ సూచించారు. అంతేకాకుండా.. అందరూ తమ సోషల్ మీడియా డీపీలలో మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలని కోరారు. ఇప్పటికే సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రోఫైల్ ఫోటోస్ మార్చేశారు. తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇండియన్ కోస్డ్ గార్డ్ అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా టీవీ9 నెట్వర్క్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తాజాగా ఇందులో హీరో విజయ్ దేవరకొండ కూడా భాగమయ్యారు. రౌడీ హీరో సముద్రంలోకి వెళ్లి ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం వారి సేవలను ప్రశంసించడమే కాకుండా అధికారులతో కలిసి సరదగా డ్యాన్స్ చేశాడు. ఈ కార్యక్రమం ఆగస్ట్ 15న టీవీ 9 తెలుగులో ప్రసారం కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.