Liger Movie Trailer Launch Highlights: విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ ట్రైలర్ లాంచ్.. సుదర్శన్ దగ్గర అభిమానుల సందడి

Vijay Deverkonda Liger Telugu Trailer: డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్(Liger). క్రేజీ హీరో విజయ్ దేవర కొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

Liger Movie Trailer Launch Highlights: విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ట్రైలర్ లాంచ్.. సుదర్శన్ దగ్గర అభిమానుల సందడి
Vijay Devarakonda Liger

Edited By:

Updated on: Jul 21, 2022 | 3:30 PM

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్(Liger). క్రేజీ హీరో విజయ్ దేవర కొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్, గ్లిమ్ప్స్ లో విజయ్ మేకోవర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు లైగర్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో లైగర్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. దాంతో సుదర్శన్ థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. నిన్నటి నుంచే అభిమానులు థియేటర్ దగ్గర హంగామా చేస్తున్నారు.

ఇప్పటికే థియేటర్ వద్ద 75 అడుగుల భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. విజయ్ కటౌట్ కు పాలాభిషేకం, పూలాభిషేకం చేస్తున్నారు ఫ్యాన్స్. దప్పులతో టపాసులతో థియేటర్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయనున్నారు. లైగర్ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ పాట ఇప్పటివరకు 30 మిలియన్+ వ్యూస్ తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో వుంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jul 2022 10:55 AM (IST)

    ఆగస్టు 25 ఇండియా షేక్ అవుతాది : విజయ్ దేవరకొండ

    రెండేళ్లు అయ్యింది సినిమా రిలీజ్ అయ్యి.. అది పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. కానీ ట్రైలర్ కు ఈ రచ్చ ఏందిరయ్యా.. అన్నారు విజయ్. ఈ సినిమాను మీకు డేడికేట్ చేస్తున్నా.. నేను డాన్స్ అంటే చిరాకు కానీ మీకోసమే చేశా.. ఆగస్టు 25 ఇండియా షేక్ అవుతాది.. ఇదే రేంజ్ లో సెలబ్రేషన్స్ జరగాలి రిలీజ్ రోజు.. 25న ‘ఆగ్ లాగా దేంగే’ అన్నారు విజయ్ . ప్రమోషన్స్ చేయడం లేదు అన్నారు కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా..?

  • 21 Jul 2022 10:49 AM (IST)

    విజయ్ చింపేశాడు : పూరిజగన్నాథ్

    విజయ్ గురించి మాట్లాడుతా.. చింపేశాడు.. రేపు సినిజమ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అన్నారు పూరిజగన్నాథ్. విజయ్ పెద్ద స్టార్ అవుతాడు. దేశంలోనే పెద్ద స్టార్ అవుతాడు అన్నారు పూరి


  • 21 Jul 2022 10:45 AM (IST)

    టాలీవుడ్ చాలా క్రేజీ క్రేజీ : అనన్య పాండే

    అనన్య పాండే మాటలాడుతూ.. తెలుగు ప్రేక్షకుల ప్రేమను కోరుకుంటున్నాను ..టాలీవుడ్ క్రేజీ  మీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నానన్న అనన్య

  • 21 Jul 2022 10:43 AM (IST)

    రౌడీ రౌడీ నినాదాలతో హోరెత్తిన థియేటర్

    సుదర్శన్ కు భారీగా చేరుకున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. రౌడీ రౌడీ నినాదాలతో హోరెత్తిన థియేటర్

  • 21 Jul 2022 10:34 AM (IST)

    పూలతో ఘనస్వాగతం..

    లైగర్ టీమ్ కు  ఘనస్వాగతం పలికారు ఫ్యాన్స్ ,  ఫ్యాన్స్ నిండిపోయిన సుదర్శన్ థియేటర్..

  • 21 Jul 2022 10:29 AM (IST)

    సుదర్శన్ థియేటర్ కు చేరుకున్న విజయ్, అనన్య

    ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన లైగర్ టీమ్. సుదర్శన్ థియేటర్ కు చేరుకున్న విజయ్, అనన్య

  • 21 Jul 2022 10:27 AM (IST)

    థియటర్ దగ్గర సందడి చేసిన పూరీ, ఛార్మి, కరణ్ జోహార్

    సుదర్శన్ థియేటర్ కు చేరుకున్నారు లైగర్ టీమ్.. పూరీ,ఛార్మి , కరణ్ జోహార్ కు ఘన స్వాగతం పలికిన ఫ్యాన్స్

  • 21 Jul 2022 09:52 AM (IST)

    ఫ్యాన్స్‌తో నిండిపోయిన థియేటర్

    సుదర్శన్ థియేటర్ విజయ్ , పూరి అభిమానులతో నిండిపోయింది. థియేటర్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తోంది. మరి కాసేపట్లో థియేటర్ కు లైగర్ టీమ్ రానున్నారు.

  • 21 Jul 2022 09:43 AM (IST)

    ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బయలుదేరిన లైగర్ టీమ్..

    ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ (లైగర్ మూవీ టీం) తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

  • 21 Jul 2022 09:39 AM (IST)

    జై రౌడీ.. జై జై రౌడీ..!

    జై రౌడీ.. జై జై రౌడీ..!  విజయన్న తోపు.. దమ్ముంటే ఆపు..! అనే నినాదాలతో ఫ్యాన్స్ సందడి

  • 21 Jul 2022 09:38 AM (IST)

    ర్యాలీగా బయలుదేరిన విజయ్ , అనన్య

    సుదర్శన్ థియేటర్ కు బయలుదేరిన విజయ్ దేవరకొండ, అనన్య పాండే.. ఫ్యాన్స్ తో కలిసి బైక్ ర్యాలీ

  • 21 Jul 2022 09:36 AM (IST)

    థియేటర్ దగ్గర పోతురాజుల సందడి

    సుదర్శన్ థియేటర్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. థియేటర్ దగ్గర పోతురాజుల సందడి చేస్తున్నారు.

  • 21 Jul 2022 09:28 AM (IST)

    దేవరకొండ ట్వీట్..

  • 21 Jul 2022 09:20 AM (IST)

    విజయ్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం

    లైగర్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ 75 అడుగుల కటౌట్ కు అభిమానులు పూలాభిషేకం, పాలాభిషేకం చేస్తున్నారు.

  • 21 Jul 2022 09:14 AM (IST)

    డప్పుల మోతతో దద్దరిల్లుతోన్న థియేటర్

    సుదర్శన్ థియేటర్ దగ్గర అభిమానుల సందడి చేస్తున్నారు. డప్పుల మోతతో దద్దరిల్లుతోన్న థియేటర్

  • 21 Jul 2022 08:30 AM (IST)

    చిరంజీవి ట్వీట్..