AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపిన విజయ్ దేవరకొండ.. రణబాలి ట్రైలర్ మెంటలెక్కించిందిగా

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంట నటిస్తున్న తాజా పిరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం 'రణబాలి'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

దుమ్మురేపిన విజయ్ దేవరకొండ.. రణబాలి ట్రైలర్ మెంటలెక్కించిందిగా
Ranabaali
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2026 | 7:20 PM

Share

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ ఆన్‌స్క్రీన్ జోడీల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో ఈ జంటకు వచ్చిన క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ‘రణబాలి’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణబాలిని ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. సాధారణ కమర్షియల్ కథకు భిన్నంగా 19వ శతాబ్దపు దక్షిణ భారత నేపథ్యాన్ని తీసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ స్పష్టం చేసింది. 1870ల కాలంలో బ్రిటిష్ పాలన, కరువు, ప్రజలపై జరిగిన దారుణాలు, వాటికి వ్యతిరేకంగా ఓ యోధుడి తిరుగుబాటు చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నాడు. ప్రజల కోసం పోరాడే తిరుగుబాటు యోధుడిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో విజయ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, పాత్రలోని కోపం సినిమాపై ఆసక్తిని పెంచాయి. బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలబడే వ్యక్తిగా రణబాలి పాత్రను చూపించారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ కథను చరిత్ర, ఫాంటసీ అంశాలతో కూడిన కథగా రూపొందించినట్లు వెల్లడించారు. చరిత్రలో జరిగిన విషాద సంఘటనలకు మరో కోణంలో సినిమా రూపం ఇచ్చే ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు.

విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు జయమ్మ. కేవలం హీరోకు జోడీగా కనిపించే పాత్ర కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రగా ఆమెను చూపించినట్లు తెలుస్తుంది. విజయ్, రష్మిక కెమిస్ట్రీపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణబాలిలో మరో ముఖ్యమైన ఆకర్షణ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ. ‘ది మమ్మీ’ వంటి చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాలో కీలకమైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో ఆయన కనిపించనుండగా, విజయ్,ఆర్నాల్డ్ మధ్య పోరాటం సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. బ్రిటిష్ పాలనలోని కఠిన పరిస్థితులు, ప్రజల బాధలు, రణబాలి తిరుగుబాటు, భారీ యాక్షన్ సన్నివేశాలుట్రైలర్ లో కనిపించాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. మొత్తానికి విజయ్ దేవరకొండను మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో చూడటంతో పాటు, రష్మికతో ఆయన కాంబినేషన్‌ను తెరపై ఎంజాయ్ చేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచగా.. ఇప్పుడు ట్రైలర్ ఆ హైప్‌ను పై స్థాయికి తీసుకెళ్లింది.

Follow Us