Vijay Devarakonda : బాలీవుడ్‌లో సొంత గొంతు వినిపించనున్న విజయ్ దేవరకొండ.. దేనికోసం అంటే..

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కితున్న సినిమా లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.

Vijay Devarakonda : బాలీవుడ్‌లో సొంత గొంతు వినిపించనున్న విజయ్ దేవరకొండ.. దేనికోసం అంటే..
Vijay Devarkonda

Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2021 | 6:17 AM

Vijay Devarakonda : క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కితున్న సినిమా లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. పూరిజగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. లైగర్ సినిమాతో విజయ్ అటు బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమానుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అప్పుడెప్పుడో ఓ ఫస్ట్ లుక్‌ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్‌ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. పూరి కూడా తన రెగ్యులర్‌ స్టైల్‌ను పక్కన పెట్టి స్లో అండ్ స్టడీగా షూటింగ్ చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. టైసన్ ఉండటంతో ఈ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఈ క్రమంలో మైక్ టైసన్ కు చెందిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ దీపావళి కానుకగా విడుదల చేశారు. ఇక లైగర్ సినిమాకు హిందీలో ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో చివరి షెడ్యూలు షూటింగు కోసం ఈ చిత్రం యూనిట్ అమెరికా వెళ్లబోతుంది. ఇక విజయ్ దేవరకొండ హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్నాడని తెలుస్తుంది. విజయ్ కు హిందీ బాగా వచ్చు కాబట్టి డబ్బింగ్ చెప్పడానికి పెద్ద ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు. దాంతో ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ అంత విజయ్ హిందీలో ఎలా అదరగొట్టబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AP Film Exhibitors: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ ఎగ్జిబిట‌ర్ల సమావేశం.. ఆన్‌లైన్ టికెట్ విధానానికి అంగీకారం

RRR Movie Song: నాటు సాంగ్‌కు సెలబ్రెటీలు ఫిదా.. మెంటలెక్కిందన్న సమంత, వెయిట్ చేయలేనంటున్న సిద్ధార్ద్..

Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్