క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. ఒకే ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారారు. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నటున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆసినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడ. దాంతో విజయ్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేయడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రెండు సినిమాలను అనౌన్స్ చేశారు విజయ్. ఇప్పటికే లైగర్ సినిమాను కంప్లీట్ చేసి .. సెకండ్ ప్రాజెక్ట్ జనగణమన ను పట్టాలెక్కించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాతో విజయ్ అలరించడానికి రెడీ అవుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
ఇక ఈ సినిమాలో విజయ్ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. శివ ప్రేమ కథలను ఎలా తెరకెక్కిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. `మహానటి` చిత్రంలో జర్నలిస్ట్ మధురవాణిగా సమంత ఫొటో జర్నలిస్ట్ విజయ్ ఆంటోని గా విజయ్ దేవరకొండ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాస్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని అలాగే చాలా కొత్తగా అడ్వెంచరస్ స్పోర్ట్స్ డ్రామా గా సాగుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ బైకర్ గా కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈసినిమాలో సాగుతుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :