Tollywood: కాఫీ షాప్ ముందు అడుక్కున్న హీరోయిన్.. ఆమె జీవితమే ఓ ఛాలెంజ్..

వ్యక్తిగత జీవితంలో అడుగడుగునా పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కెరీర్ మొదట్లో ఓ కాఫీ షాప్ బయట అడుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన సినిమా దౌ ఔర్ దో ప్యార్. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న విద్యా బాలన్ తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

Tollywood: కాఫీ షాప్ ముందు అడుక్కున్న హీరోయిన్.. ఆమె జీవితమే ఓ ఛాలెంజ్..
Vidya Balan

Updated on: Apr 07, 2024 | 8:54 AM

ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకున్న తారలు.. ఒకప్పుడు ఎన్నో అడ్డంకులను, అవమానాలను ఎదుర్కొన్నవారే. బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రశంసలు అందుకుని.. స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ విద్యాబాలన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విద్యా.. నిత్యం ఎదొక వార్తలలో నిలుస్తుంది. ప్రతిభావంతులైన నటిగా, ఆమె నటనకు ఎల్లప్పుడూ ప్రశంసలు లభిస్తాయి. ఇప్పుడు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న విద్యాబాలన్.. కెరీర్ తొలినాళ్లలో అనేక కష్టాలను ఎదుర్కొంది. వ్యక్తిగత జీవితంలో అడుగడుగునా పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కెరీర్ మొదట్లో ఓ కాఫీ షాప్ బయట అడుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన సినిమా దౌ ఔర్ దో ప్యార్. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న విద్యా బాలన్ తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

కెరీర్ తొలినాళ్లలో తన స్నేహితులు విద్యా్కు ఓ ఛాలెంజ్ చేశారట. ఓ కాఫీ షాప్ ముందు నిలబడి అడుక్కోవాలని సూచించారట. భారతీయ సంగీత బృందంతో కలిసి ప్రదర్శన కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందట. ఆ సమయంలోనే తన టీంలోని ఓ వ్యక్తి .. విద్యాకు ఓ సవాలు విసిరారట. కాఫీ షాప్ ముందు నిలబడి అడుక్కోవాలని చెప్పడంతో విద్యా ఏమాత్రం ఆలోచించకుండా అక్కడే ఉన్న ఓ కాఫీ షాప్ వెలుపల నిలబడి.. అందరినీ డబ్బులు ఇవ్వాలని కోరిదంది. తనకు చాలా ఆకలిగా ఉందని.. తినడానికి ఏదైనా ఇవ్వాలని కోరింది. అయితే అప్పటికే ఆమె నటి అన్న సంగతి చాలా మందికి తెలియదు.

స్టార్ హీరోయిన్ అయినా.. కాఫీ షాప్ ముందు నిలబడి అడుక్కోవడం చూసి తన టీం సభ్యులు తలదించుకున్నారని తెలిపింది. అయితే తన స్నేహితుడితో కలిసి విద్యాబాలన్ చేసిన ఈ ఛాలెంజ్ కేవలం ఓ బిస్కెట్ కోసమని చెప్పుకొచ్చింది. అంతకుముందు ఓసారి బిచ్చగాడి వేషం వేసుకుని హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటో అప్పట్లో తెగ వైరలయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.